Saree Psychology
Saree Psychology కరోనా పుణ్యమాని, ప్రస్తుతానికి ఐదు చురీదార్లు, నాలుగు నైటీలుగా వ్యవహారం నడిచిపోతోంది. ఇంతకుముందు ఎన్ని చీరలున్నా అదేదో కలర్ నా దగ్గర లేదే అన్న ఫీల్ షాపుల చుట్టు తిప్పించేది. ఇప్పుడేమో సమ్మర్ కోసమని ముందు చూపుగా ఇస్త్రీ చెయ్యించుకున్న పది కాటన్ చీరలు పిల్లి కూనల్లా పై అల్మైరాని ఆక్రమించేశాయి. షాపింగ్ మాటే మైండ్ ఫోల్డర్ లో డిలీటై పోయింది. ఎప్పుడాఇనా చీర కడితే, ఇప్పుడంత అవసరమా అన్నట్టు పిల్లలు ఒక లుక్కేస్తున్నారు. బట్టలంటే మన మనిండ్ లో ఒక స్టేటస్ సింబల్ అన్న పారామీటర్. కలర్ కాంబినేషన్ల క్రేజ్, అందరి వహ్వాలా మోజు, ఒక్కోసారి నాకిష్టమైంది, నీకు కష్టంగా వున్నా ఐ డోంట్ కేర్ అనేలా అనిపించే కాంబినేషంతో కళ్ళు మసక తెప్పించే కాంబినేషన్ కోరి కొనుక్కోవడం ఒక థ్రిల్. కట్టేది ఒక చీరే అయినా, దానికి ఉపోద్ఘాతాలు చాలానే వుంటాయి. మచ్చుకి కొన్ని చెప్తాను. కొన్ని కలర్ కాంబినేషన్లు భలే నచ్చుతాయి. ఆ శారీ కానీ, డ్రెస్ కానీ చిరిగి పోయే స్థితి కి వచ్చినా కొత్తగా కొన్నప్పటి తళుకు దాని ప్రతి పోగులోను మనల్ని చేతులు కట్టేసి, ఈ సారి ఒక్క సారి... ఇదే ఆఖరు సారి అంటూ ఇంకో రెండు సం...