Saree Psychology

Saree Psychology 
కరోనా పుణ్యమాని, ప్రస్తుతానికి ఐదు చురీదార్లు, నాలుగు నైటీలుగా వ్యవహారం నడిచిపోతోంది. ఇంతకుముందు ఎన్ని చీరలున్నా అదేదో కలర్ నా దగ్గర లేదే అన్న ఫీల్ షాపుల చుట్టు తిప్పించేది. ఇప్పుడేమో సమ్మర్ కోసమని ముందు చూపుగా ఇస్త్రీ చెయ్యించుకున్న పది కాటన్ చీరలు పిల్లి కూనల్లా పై అల్మైరాని ఆక్రమించేశాయి. షాపింగ్ మాటే మైండ్ ఫోల్డర్ లో డిలీటై పోయింది. ఎప్పుడాఇనా చీర కడితే, ఇప్పుడంత అవసరమా అన్నట్టు పిల్లలు ఒక లుక్కేస్తున్నారు. బట్టలంటే మన మనిండ్ లో ఒక స్టేటస్ సింబల్ అన్న పారామీటర్. కలర్ కాంబినేషన్ల క్రేజ్, అందరి వహ్వాలా మోజు, ఒక్కోసారి నాకిష్టమైంది, నీకు కష్టంగా వున్నా ఐ డోంట్ కేర్ అనేలా అనిపించే కాంబినేషంతో కళ్ళు మసక తెప్పించే కాంబినేషన్ కోరి కొనుక్కోవడం ఒక థ్రిల్.

 కట్టేది ఒక చీరే అయినా, దానికి ఉపోద్ఘాతాలు చాలానే వుంటాయి. మచ్చుకి కొన్ని చెప్తాను.
కొన్ని కలర్ కాంబినేషన్లు భలే నచ్చుతాయి. ఆ శారీ కానీ, డ్రెస్ కానీ చిరిగి పోయే స్థితి కి వచ్చినా కొత్తగా కొన్నప్పటి తళుకు దాని ప్రతి పోగులోను మనల్ని చేతులు కట్టేసి, ఈ సారి ఒక్క సారి... ఇదే ఆఖరు సారి అంటూ ఇంకో రెండు సంవత్సరాలు మన తో పాటూ అన్ని వూళ్ళూ చుట్టేస్తాయి. పాతబట్టల్లో పడేసే రోజు కూడా మనసు బకెట్ల కొద్దీ కన్నీళ్ళు కరుస్తుంది.
రెండో రకం వి ఏంటంటే, ఇవి అదృష్ట లక్ష్ములు. వాటిని కట్టుకున్న రోజల్లా లక్కు మాలక్ష్మి లుక్కంతా మన మీదే. పీకల మీదకి వచ్చిన ప్రొబ్లెంస్ ఏవైనా సరే దూది పింజల్లా తేలిపోవల్సిందే... ప్రతి ఒక్కళ్ళకీ అలాంటి ఫేవరిట్ వార్డ్ రోబ్ ఐటం ఒకటైన ఖచ్చితం గా వుంటుందని ఫేస్ బుక్ వాల్ గుద్ది మరీ చెప్పగలను. నాకైతే కలర్ బేస్డ్ మాలక్ష్మి అన్నమాట... గ్రీన్ కలర్, బ్లూ కలర్ ఇంకా వైట్ ఏంజిల్స్. ఈ కలర్స్ లో శరీస్ కట్టుకున్నరోజు ప్రాబ్లెంస్ కనుచూపు మేరలో కనిపించవు.
మూడో రకానికొద్దాం... అసలు ఆ డ్రెస్ వేసుకున్న మొదటి రోజున ఎంతటి ఘోరం జరుగుతుందంటే, మళ్ళీ రెండో సారి కడదామన్నా నిద్రలో కూడా ఝడుసుకుని ఆ డ్రెస్ మార్చేంత అన్నమాట. దీనికి కలర్ భేదం లేదు (నా వరకూ). ఏక్ దిన్ కా సుల్తానాలు అవి- ఒక్కరోజు భాగ్యాలన్నమాట. అలాంటి ఝడుపుల ఝంఝామారుతాలైన చీరలు మూడున్నాయి. అవి పాపం నా ఫేవరిట్ కలర్స్ వ్హితె, బ్లూ, గ్రీ కాంబినేషన్లైనా, అదేంటో, ఆ శారీ కట్టిన ఫస్ట్ రోజు చిన్న ఏక్సిడెంటాయ్యింది. చీరేం చేసింది అందులో పాపం, ఇష్టం గా కొనుక్కునా కదా అని రెండో సారి కట్టుకున్నాను. ఆ రోజు క్లాస్ లో స్టూడెంట్స్ తో గొడవ. లాబ్ లో సిస్టంస్ లో కీస్ ఎత్తేసారు. IT స్టూడెంట్స్. బ్యాచ్ మొత్తాని HoD దగ్గరకి తీసుకుపోయాను. రెండు రోజుల విచారణా వ్యవహారం. తల దిమ్మెక్కి పోయి, చీర అటకెక్కించాను.
రెండో ఝడుపు మారాణి, నలుపు రంగు. దానికీ నాకూ చిన్నప్పటి నుంచీ చుక్కెదురు. అయినా ఆ కలరంటే వున్న పిచ్చికి బ్లాక్ బాక్ గ్రౌండ్ లో వైట్, బ్లాక్ కి ఆరెంజ్ బార్డర్, బ్లాక్ లో అదీ బ్లాక్ లో ఇదీ అని నచ్చ చెప్పుకుంటూ కొనేసి కట్టేస్తుంటాను.
లాస్ట్ గా దిల్ వాలీ కప్డే... లవ్ అట్ ఫస్ట్ టచ్... అసలు ఇలా కట్టుకోగానే అలా ఒంటిని హత్తుకుపోయే చీరలు కొన్ని వుంటాయి. అవి కట్టుకున్నరోజు, ఎంత హాయిగా వుంటుందో చెప్పలేను. అది నాకోసమే పుట్టాను అన్నట్టుంటుంది.

ఇంకొన్ని రకాలావి యీ కాటగిరీ కి పూర్తి విరుద్ధం. నన్ను ముట్టుకుంటే కరుస్తా అంటాయి. ఒకే ఒక్క సారి అలాంటి శాల్తీ ని కొన్నాను. చీర కట్టుకుంటే ఎప్పుడు తీసి పారేద్దామా అన్న ఫీల్ శత్రు సైన్యం కోటని చుట్టుముట్టినంత ఘోరంగా మైండ్ ని ఆక్రమించేసేది. నేవీ బ్లూ కి గ్రీన్ బార్డర్ తో సిల్వర్ బుటా వుందని ముచ్చటపడి కొనుక్కున్నాను. కట్టుకుంటే ఐదు నిముషాల వరకూ ఓకే. తర్వాత మాత్రం ఒళ్ళంతా కంపరమొచ్చేసేది. ఎన్ని రకాలుగా ట్రై చేసినా, దాన్ని భరించే శక్తి పోయి, రెండో చీరకి షిఫ్టవ్వాల్సిందే. అది పెద్దాడు పుట్టిన కొత్తలో. అంటే దాదాపు పాతికేళ్ళ పైమాటే. అంతే మళ్ళీ అలాంటి వాటి జోలికెళ్తే ఒట్టు.

పోస్టుకి శుభం పలుకుతూ చివరాఖరుగా చెప్పొచ్చేదేమిటంటే...

మనకంటూ
మనసుకంటూ నచ్చితే
ఏ రంగైతే ఎంటీ,
కలిసొచ్చేదైనా, ఎదురొచ్చేటట్టున్నా
డీ అంటే రెఢీ
హేంగర్ నుంచి తీసెయ్యడమే
కుచ్చిళ్ళు పోసి కుదురు నేర్పించేసి
రెఢీ అయిపోవడమే...




Comments

Popular Posts