Skip to main content

Posts

From Andhra Jyothi.... Vividha

సాహితీ విమర్శకు ఆమోదమెలా లభిస్తుంది?
విమర్శావిధానంలో విభాగాలేవో వున్నాయి. అయితే మనస్తత్వ విమర్శ, సాంఘిక విమర్శ, భౌతికవాద విమర్శ అంటూ జరిగే ఆ విమర్శావిధానాల వర్గీకరణ పాఠ్యగ్రంథాలలో కనబడుతుంది కానీ పత్రికలలో కనబడదు. పత్రికలలో విమర్శ అంటే విమర్శే. రచనలని ‘క్రైం కథ’ ‘సరసమైన కథ’ అంటూ వర్గీకరించి ప్రచురించినట్లు గా విమర్శలని వర్గీకరించి ప్రచురించడం వుండదు. కనుక విమర్శకుడు ఒక దృష్టినుపయోగించి విమర్శ చేస్తే ఆ దృష్టితోనే చదివిన పాఠకులకి తప్ప మిగిలిన వారందరికీ ఆ విమర్శ అసమగ్రంగాను, అసంబద్ధంగాను కనిపిస్తుంది. అంటే ఏ విమర్శ అయినా కొద్దిమందినే, కొన్ని వర్గాలనే ఆకర్షిస్తుంది తప్ప అందరినీ ఆకర్షించడం జరగదు. నిజమేనా? నిజమే అయితే ఈ పరిస్థితి వాంఛనీయమేనా? అవాంఛనీయమైతే దీనిని అధిగమించే మార్గం ఏమీ లేదా?
ఆ ప్రశ్నలు అలా వుంచితే, రచయితలలో కూడా ఈ విధమైన విభిన్న దృక్పథాలు, భావజాలాలు ఉన్నాయి. అయినప్పటికీ అన్ని వర్గాల పాఠకులనీ మెప్పించే రచయితలు కొందరు వుంటారు. మెప్పించడం అనేది సరైన మాట కాదేమో! మరోలా చెప్పాలంటే ఏ వర్గానికి చెందిన పాఠకులైనా నిర్లక్ష్యం చేయలేని రచయితలు కొందరు వుంటారు. కొందరు రచయితల అభిప్రాయంతో, భావజ…
Recent posts

మనసా యూజ్ విత్ కాషన్ !!!

ప్రేమకీ ఎక్స్పైరీ డేట్ వుంటుంది
 మనసా యూజ్ విత్ కాషన్ !!!
కోరికల వాగుల ఆనవాళ్ళు మారుతాయి
 చిరునామాలూ మారుతాయి
కోరి తలుపు తట్టిన వాక్యాల స్థానం లోనే
నీతో ఏం మాట్లాడామంటావ్ అన్న ప్రశ్నలే ఎదురవుతాయి
కొత్త  పాతబడుతుంది
కొత్తదనాలేవీ లెవనుకున్నాకా
కొంచెం కొంచెం మారిపోతావు
మెరుపులే ఆనవాళ్ళైన కళ్ళూ
అలవోకగా చూపులు తప్పించుకుంటాయి
ఆనందం చిరునామా ఐన పెదవుల్లోనూ
ఉదాశీనపు సరళరేఖలే వుంటాయి
ఆర్తి ధ్వనించిన కంఠం
శృతి మరిచిపోతుందీ
గాలికి ధూళి లేచినంతసహజం ప్రేమ
మరి దుమారం ఎటుపోయిందీ
గుండె మారాములేవీ పనిచెయ్యవు
వచ్చివెళ్ళిన కాలం
ఎప్పుడూ సాక్షీ మాత్రమే
ఏ న్యాయస్థానం అక్కర్లేని ఎమోషనల్ ధర్మశాస్త్రం
మనువేం రాశాడో తెలీదుగానీ
మనిషిగా యీ గుండెకి అడ్డుకోత నిలువుకోతలు ఫ్రీగా చెయ్యబడును

ఆశల కోరికల ఆనవాలైనందుకూ  నువ్వే ముద్దాయివిక్కడ
యే న్యాయస్థానాలూ యే వైద్యాలకూ అందని
రంపపు కోతల్ని మనసులోనే పొదిగి కిరీటంగా అలంకరించుకో
మోహలోక ఒలింపిక్స్ లో స్వర్ణ పతక గ్రహీతవా
నమ్మకపు ఓటమి ని నిగ్రహించుకుంటున్న విలాపానివా
చూజ్ యువర్ చాయిస్
ఎవరికీ క్షణం ఆగే సమయం లేదిక్కడ
అంతా మానవతా వాద ప్రియులు కదా...
మానవుడా
మానవీయ విలువలకి పట్టం కట్టే మ…

కొన్ని పునర్జన్మలు

కొన్ని జ్ఞాపకాలు
సమాధి గోడల్ని చీల్చుకు వొచ్చే మర్రి మొలకలు

మెలకువని నిద్రపుచ్చే
స్వప్న గమకాలు

మయసభలాంటి
మోహ శిధిలాలు

 జ్ఞాపకాలెప్పుడూ ప్రతిద్వనిజనితాలే...

ప్రతిధ్వనుల్నీ
శృతి బద్ధం కమ్మంటే
రాగాలాపన వికృతమే

నిన్నని నేటిలో వెతుకులాట ఒక పెనుగులాట
లేనిది నిజమనుకోవడమొక మోహం

పదాలతో వీడ్కోళ్ళ విత్తులెన్ని చల్లుకున్నా
మనసులో నాటుకోవని తెలిసీ
 కాలం బీడుపోక
చిగుళ్ళేసే వేదనలు కొన్ని

మనసు చావలేదనీ
స్పందన బ్రతికే వుందనీ
ఊరడిస్తుంటాయి...

its my life....

08-05-2015

ఏకాంతాలు నావి కానపుడు
హృదయంలో జాడల వెదుకులాటేల..... ఆశ ఒక అమాయకపు జాలరి
ఎదురుచూపుల తీపి విడలేక మనసు వేలు వదలక కరిగి పోయిన నన్ను
తిరిగి ఘనీభవించమంటోంది
నడివేసవిలోనూ కరగలేని
హిమనదంలా..... ******
ప్రకటించాలనే ప్రేమ ఆర్తితో దాచుకునే గుండె
రెంటి ఉరవడే... అణువణువూ !!!
*****
 ప్రేమ ప్రవాహమైనపుడు మనసు పసిపాపవుతుంది
ఆలంబనే ఆకాశంలా దూరమైనపుడు..
తనకు తానే తల్లవుతుంది  *****
 మనసు అలసటకి జీవితపు అపనమ్మకానికీ  కవిత్వమొక ఆలంబన *****
 మనసు అలసటకి జీవితపు అపనమ్మకానికీ  కవిత్వమొక ఆలంబన

సుగంధాలన్నీ గుండెలో పరిమళిస్తే అదో మంచుపూలబాట మరిచిన వసంతాల ఉనికి కోసం కాలం పరదాల వెతుకులాట

అరణ్యపుదారుల్లో  అందాల వెంట ముళ్ళు పూస్తాయి వెన్నెల కూడా భయపెడుతుంది కలత నిదురైనా జోలపాటే కలకు తోడవుతుంది!  ***************  ఏకాంతపు స్పంజి తోటి
తలపుల ఫలకం తేటగీతం

ఒక రాత్రి... మరొక రాత్రి -- కోడూరి విజయకుమార్

"కనుల అంచులు తాకే నిదుర పడవకై ఇలా మెలకువ తీరాన యెదురు చూడవలసిందే యిక,
ఈ రాత్రి నదిని భారంగా ఈదవలసిందే..."
 కోడూరి విజయకుమార్ గారు వ్రాసిన
ఒక రాత్రి... మరొక రాత్రి -- కవితా సంపుటం లోని
అదే శీర్షిక తో వున్న కవితలోని మొదటి నాలుగు వాక్యాలతో మొదలైన ఆ అక్షర స్నేహం  మొదటి పేజీ నుండి చివరి పేజీ వరకూ నిరాఘాటంగా హృదయం వెంట ప్రవహించింది.
 అత్యంత నిరాడంబరమైన వాక్యాల నుంచి భావం ఒక్కో వర్ణంలో కి తర్జుమా అవుతూ, కవర్ పేజీ లోనీ వెన్నెలా, చీకట్ల దోబూచులాట లేదా నిర్మల స్నేహమా అనిపించేలా మనసు తో స్నేహిస్తుంది.  ఆనందాన్ని వెతుక్కుంటూ మనమెటు పారిపోయినా మనసు మాత్రం
గాయపరచిన మాటల శకలాల్ని
ఒకటొకటిగా మోసుకు సాగవలసిందే
అని తీర్మానించేశా రు  విజయ్ కుమర్ గారు.

నిదురపడవ, మెలకువ తీరం, రాత్రి నది... యీ మూడు ప్రతీకలు తర్వాతి కవితల్లో వొచ్చే హృదయ గానానికి ముందు మాటలు మాత్రమే.

మొదటి కవితలో ఇంకా ముందు కెళ్తే,
దోసిపి పట్టిన హృదయం లో తాజా పుష్పమొకటి
ఎప్పటికైనా చేరుతుందని ఎదురు చూడడటం ఒక భ్రమ... అంటారు
సత్యమైనకూడా, ఇతరుల అనుభవాలు నిరూపిస్తున్నా కూడా ప్రతి మనసూ తన చుట్టూ నిర్మించుకునే అందమైన  ఆ కలల కల్లల గూడు ని …

ప్రశ్నా కిరీటాలు!

ప్రశ్నా కిరీటాలు!
--  జయశ్రీ నాయుడు

కొన్ని పొరలు దాచుకున్న సత్యాలు
కాలం చిర్నవ్వు తళుకులోనే ఆవిష్కృతమయేది

మొదటి అడుగులోనే లెక్కల లౌక్యమెందుకు

ఎంత దూరముందో తెలియని ప్రయాణం

శ్వాసల అడుగులు వాయులీనాలు
ఆత్మాంతరంగాల వాదోపవాదాలు
కనిపించే కొన్ని లోకాలు
నిర్ధారింపుల్లా దివారాత్రాలు

నిజాయితీ తో అబద్ధాన్నైనా జీవిస్తా
హక్కు నాది

నీ నిజంలో నిజమెంతో నిర్ధారించనీ
అపనమ్మకం కూడా నా హక్కే...

అనుభవాలకు నిరూపణలడిగే కాలంలో
వానచినుకు యేమేఘానిదో ఎలా ఎరుకపర్చాలి..

గుండెతడి యే మేఘానిదో ఆ గుండెకే ఎరుక
మానవత్వపు స్టెతస్కోప్ లేకుండా యే నాడి లెక్కిస్తావ్..

ఎండలో వేడిగా వెలుగులీనుతూ
మేఘంలో ఆర్ద్రతగా నిండి దయ వర్షిస్తూ
పత్రంలో హరితంగా మమేకమౌతూ
పుష్పంలో రంగుల్లా ఇంద్రధనుసు
మినియేచర్ ప్రకృతి

మనిషీ....

వికృతులూ ప్రకృతిలో భాగమే
ఎన్నిక నీదీ నాదీ

యే అడుగుకైనా
 మడుగులుగా కూడుకునే గతాలౌతుంది కాలం


చివరి మలుపులో
 ఏ ప్రతిబింబం నిర్ధారించుతావు

 వెనక్కి తిరిగినపుడు
సమాధానపు సంతృప్తి చిరునవ్వు లా???
సందేహాత్మాశ్రయ జగత్తు లా???

 మూసిన  పిడికిట్లోని ప్రశ్నలే
 స్తంభించిన శ్వాసగా  శరీరపు పరిధిగా
 స్వేచ్చా మయ జగత్తు రచించుకున్న …

లిల్లీ పూల సాయంత్రం

|| లిల్లీ పూల సాయంత్రం ||
--  జయశ్రీ నాయుడు

ధరిత్రిపై తన ప్రేమనంతా
వర్షిస్తున్న సూర్యుడు
వేడిసెగల్లో ఉక్కిరిబిక్కిరి హృదయాలు
అంతా నిశ్శబ్దం

పరిచయపు పరిమళం లీలగా
ఏదీ ఎక్కడా ???

ఓ చిరుతరంగం అంతరంగంలో
ఎవరో ఎక్కడో....
ఇక్కడే వున్నారు

అంతరంగం కనుల్లోంచి ఉబికింది
వాయు పరిమళంతో గుసగుసలాడింది
చెట్టాపట్టాలేసుకుని
చుట్టూరా ప్రవహిస్తోంది

అందరూ ఎవరో ఎవరో
కొందరు తెలిసిన వారూ
అలా ప్రవహిస్తూనే వుంది
వరుస తర్వాత వరుస
కేశపాశాలూ కనుముక్కు తీరులు

అనిమిషమాత్రంగా స్పృశించుకుంటూ...
వాటిని వెనక్కు నెడుతూ
తాను ముందుకురుకుతూ

అదిగో అక్కడా ఆ ముందు వరుసల్లోనే
అంతరంగ ధ్వనులు ఉలికిపడుతున్నాయి
నయనమా మనసుతో చూడు ఇక్కడే ఇక్కడే అంటోంది

స్వచ్ఛమైన జాజి చ్ఛాయ
చిరునవ్వు పరిమళాల లిల్లీ పువ్వు
ఆ రూపమేనా
ఎవరితోనో ముచ్చటిస్తోంది..

రెండువరుసలు ముందుకు దూకిన హృదయం
వెనక్కు తగ్గి ఆ పరిమళం దగ్గరే ఆగింది

ఆమెనే కేంద్రంగా స్థిరపడింది
కళ్ళూ మనసూ అక్కడే ఆగిపోయాయీ
ఆమెనా... ఏమో...
ఉహ్హూ...'ఆ నవ్వు విరిసే దాకా ఆగు
అనుకుంటూంది

ఇంతలోనే పరిచయమైన నవ్వులు విచ్చుకున్నాయి
అంతవరకూ ఉగ్గబట్టుకున్న ఫౌంటేఇన్
వెన్నెల్లా ఎగజిమ్మింది
నాలోనే...
లిల్…