ఇలా.. ఇంకోలా.. మరోలా..


నాకై నేను.. నన్ను వెతుకుతూనే వున్నాను..

ఇలా.. ఇంకోలా.. మరోలా..

కాలం  లో మారిన అద్దాన్నా
పదాల సడిలో దాగున్న మౌనాన్నా

ఆశలు పోగేస్తున్న అక్షరాన్నా
మనసు మళ్ళీ మళ్ళీ చదువుకున్న పేజీనా 

ప్రేమ పరుచుకున్న ఆకాశాన్నా
ఆకాశంలా కనిపించే అనంతాన్నా..


నిలవనీయని పాదం పదమై
నిశ్శేషాలైన భావాల బోయీల సాయం

ఆగనివ్వని కాలం ఓ చైతన్యం
ఇక్కడే.. ఇలా... ఎప్పుడూ ఒకేలా...  అనుకున్నా..
ఎప్పుడైనా... ఎలాగైన.. ఏదైన అని కాలం నవ్వుతుంది

మనసు మందసం లో ఇన్ని క్షణాల్ని జారేసి
మరిన్ని అందుకోవాలనే ఆశలదోసిలి

కాలానికీ నాకూ ఇదో ఆట
కలల్లో  కాంతులు వెతికే దోబూచాట

-- Jayashree Naidu
06/04/13



Comments

  1. మీ మనసు కలం జ్ఞాపకాల పొలం లొ సాగు చేసిన
    సుమాల పరిమళం మనసుని మైమరిపిస్తోంది!!!
    నిశ్శబ్దంగా మదిలో నాటుకునే మీ కవిత లోని పదాలు
    మరిన్ని మధురోహల పూల మాలల కోసం చకోరిలా నన్ను ఎదురుచూసేలా చేస్తున్నాయి!!

    ReplyDelete
  2. Thank you Gunja Rajasekhar garu

    sorry for this late response.. ippude chusanu.. thanQ

    ReplyDelete

Post a Comment

Popular Posts