నువ్వూ నీరే, నేనూ నీరే!
''అయ్యో! నేనెంత అల్ప జీవిని. పెద్ద అలలు నన్ను అలవోకగా ముంచి, పట్టుకు లాక్కుపోతాయి కద''..అనుకుంది చిన్న అల
అంతలోనే ఒక పెద్ద అల ఎగిసి అడుతూ వచ్చింది.
''అయ్యో!'' అని అరిచింది చిన్న అల.
''ఏమయింది. నీ మొఖం నువ్వు చూసుకో. నువ్వెవరో నీకు తెలియదా!'' అంది పెద్ద అల.
''నేనెప్పుడు ఆలోచించలేదు. నేను చిన్న అలనే కదా?'' అని అడిగింది చిన్న అల.
''నువ్వు అలవే. కాని అల నీ శాశ్వత రూపం కాదు..తాత్కాలిక రూపం మాత్రమే. నువ్వు నీటివి'' అని బోధించిది పెద్ద అల.
''నీటినా?'' అడిగింది చిన్న అల.
''అవును నువ్వు నీటివే. నువ్వే కాదూ, నేను నీటినే. నీలాగే నా రూపమూ తాత్కాలికమే. నువ్వూ నీరే, నేనూ నీరే.
''నీటినా?'' అడిగింది చిన్న అల.
''అవును నువ్వు నీటివే. నువ్వే కాదూ, నేను నీటినే. నీలాగే నా రూపమూ తాత్కాలికమే. నువ్వూ నీరే, నేనూ నీరే.
నువ్వెవరో నీకు తెలియక దిగులు పడుతునావు నీ నిజస్థితి తెలిస్తే నీకు భయమనేది ఊండదు''.
అంది పెద్ద అల.
''నిజంగానా? నువ్వు నేను ఒకటేనా?' అడిగింది చిన్న అల.
''అవును మహా ప్రకృతికి వేర్వేరు రూపాలం, తాత్కాలిక రూపాలం మనమందరం. అన్నిటికి మూలం ఒకటే. కలవరపడకు'' ఆత్మ భోద చేసింది పెద్ద అల.
''నిజంగానా? నువ్వు నేను ఒకటేనా?' అడిగింది చిన్న అల.
''అవును మహా ప్రకృతికి వేర్వేరు రూపాలం, తాత్కాలిక రూపాలం మనమందరం. అన్నిటికి మూలం ఒకటే. కలవరపడకు'' ఆత్మ భోద చేసింది పెద్ద అల.
ప్రపంచంలో సర్వం అనాది ప్రకృతే. ఊన్నవన్ని దాని రూపాలే.
విభజన ఆలోచనే మన ఆశ నిరాశలకు ,అనుబంధాలకు,భయాందోళనలకు కారణం. - జెన్ కథలు
very thought provoking one...thank u Jayasri Nayudu gaaru..
ReplyDeleteU are welcome Varma garu..
ReplyDeleteit provoked my thoughts..
so shared...