అల్లుకున్న మౌనం
నన్ను నిన్నూ కలిపినపుడల్లా
కాలం కొత్త రచనకు శ్రీకారం చుడుతూనే వుంటుంది
గుండె చప్పుడు కొత్త సంతకమౌతుంది
గాలికే అందని సుగంధం శ్వాసిస్తుంది
నువ్వు నాకు తెలుసన్న విశ్వాసం
నాకు నేను కొత్త కాదన్న పాతదనం
అల్లుకున్న మౌనంలోంచి క్షణాల కనురెప్పల్లోంచి
ఓ అనుభూతిలో కరిగి పోతాయి
యెన్నో ఊహలూ
అలల ఆలోచనలూ
కరిగి మరిగి ఆవిరైన
పులు కడిగిన పసిడిలా
తీరం ఎదురు చూసిన అలలా
వెన్నెల వెతుక్కున్న ఆకాశంలా
ఆత్మను నింపుకున్న దేహంలా
ఆ వెలుగు లో వేల 'నేను'లు చూసుకున్నా
జయశ్రీ గారూ, ఇటీవలి మీ వాక్యాలన్నీ వొక ఆనందమయిన బాధని,వ్యక్తావ్యక్త మానసిక వ్యాకరణాన్ని భలే చెప్తున్నాయి. ఈ కవిత మరీనూ! మరీ ఆ చివరి నాలుగు వాక్యాలు !
ReplyDeleteథాంక్యూ అన్న మాట భావాన్ని మరీ కుదించేసినట్టవుతుంది. మీ అక్షరాల శోభ... ఆత్మీయ పరిమళం తోటి... నా పదాలు ధన్యం అఫ్సర్ జీ
Deleteచక్కగా రాశారండి,..వర్డ్ వెరిఫికేషన్ తీసేస్తే కామెంట్ చేయడం సులభంగా వుంటుందండి,.
ReplyDeleteThank you andi
DeleteReg: Word Verification..I think its the blog designing technical obligation. Is there any way to remove it..???
జయా గారు...భావాలను సరళ పదాల్లోకి ప్రవేశపెడుతారు మీరు.. తెల్లతెల్లవారు జామున పచ్చని గుట్టల నడుమ వెలసిన దారిలో.. ప్రశాంత నడక మీ కవిత్వం ... //
ReplyDeleteThank you aasakti garu
DeleteA poem of sentiment.Nice one.
ReplyDelete