అహానికీ ఇహానికీ కటిఫ్...



అర్థాలన్నీ అబద్ధపు అలంకారాల్ని తీసేశాయి
స్ఫటికమంత నిర్మలత్వం నిండిన ఆత్మత్వం

పడుతూ లేస్తూ.. ఎన్ని నడకలో
జారుతూ జోగుతూ.. ఎన్ని అడుగులో

దీపమార్పినా..
మనసునాపని ఎన్ని ఆలోచనలో

రెప్పల లోకంలో
రేగుతూ వూయల వూగినవెన్ని కలలో

నువ్వు.. అన్న ఉనికి చుట్టూ
ఎన్ని ఊహల అహాల ఇహాలో

అహం కొలిమిలో ఎన్ని క్షణాల లోహం కరిగిందో
రూపం ఆవిరై మోహం కమురు మిగిలింది

నిర్మోహత్వం నిలవని నీడల్లో
దుఖాల ఇళ్ళు  పునాదులు కట్టుకుంటున్నాయి


ఇక్కడున్నటుగా సుఖం చేతికందాలన్న ఆతృత
దుఖమంతా ధూళిలో కలపాలన్న కలవరం

పరుగులెడుతూనే పాలు కావాలని మనసు మారాం
పందేలన్నీ గెలిచెయ్యాలన్న స్వార్థం

అచ్చమైన స్వార్థం రూపెత్తిన మనిషిని...


అన్నిటినీ చిరునవ్వులా కరిగిస్తూ
ఆత్మతో నగిషీలు పెడుతూ
అడుగు అడుగులో దుఖాల్ని కుదించుకుంటూ
అంగలుగా ఆనందం ఆహ్వానిస్తూ




అహానికీ ఇహానికీ కటిఫ్ చెప్పి
నా నేను గా నాకోసం నిరాకార ఆకాశమై విస్తరిస్తున్నా..!

--- Jayashree Naidu

**
Kavi Yakoob's comment in Kavisangamam page in Facebook
https://www.facebook.com/groups/kavisangamam/permalink/502328546486569/?notif_t=like

అన్నిటినీ చిరునవ్వులా కరిగిస్తూ
ఆత్మతో నగిషీలు పెడుతూ
అడుగు అడుగులో దుఖాల్ని కుదించుకుంటూ
అంగలుగా ఆనందం ఆహ్వానిస్తూ

అహానికీ ఇహానికీ కటిఫ్ చెప్పి
నా నేను గా నాకోసం నిరాకార ఆకాశమై విస్తరిస్తున్నా..!// తాత్వికత నిండిన కవిత.The poet is an inventor/He invents so completely/That he succeeds in inventing/That the pain he really feels is pain- చదివిన ఒక స్పానిష్ కవిత గుర్తొచ్చింది మీ కవిత చదువుతున్నప్పుడు.! || అహానికీ ఇహానికీ కటిఫ్...|| శీర్షిక నప్పింది.మీ కవితలు అంతర్లోకాల్లోని రహశ్యాలను వెతుక్కుంటూ పయనిస్తున్నాయ్.జయహో!

Comments

Popular Posts