ఒక నీడ - నీరెండ

నిరంతరం వెదుకులాటే..
ఆ చివరి నుండి యీ కొన వరకూ
ఆ చిగురు నుండి.. ఒక వేరు వరకూ
ఆకాశానికీ ఆశలకూ..
క్షణానికో అక్షరంగా ముక్కలయ్యాను.


అవును.. నాకు తీరిక లెదు.. 
ప్రేమని పదాల్లో తర్జుమా చేసేందుకు

పంచే నిశ్శబ్దాన్ని 
నిలువునా నీరెండగా చూపించు 
అది ఎండా.. నీడా.. 

నమ్మకం ఒక నీడ
నిజం మరి ఎండా..
నిజం లేని నమ్మకం
మరి నీరెండే.. 

Comments

Popular Posts