|| .............. || (జీవితాన్ని ఒక పదం లోకి కుదించడం.. అసంభవం.. )
కాగితం మీద అంతా చదునుగానే వుంటుంది
జీవితం లోకి రా ఎన్ని ఎగుడుదిగుళ్ళో
చిత్ర విచిత్ర జామెట్రీలు
తల్లకిందులు చేసే గణితాలు
గుణింతాలకే గుక్క తిప్పనివ్వని నిందారోపణలూ..
వెక్కిరించి పోతాయి గాలివాటు స్వార్థాలు
జీబ్రా చారల్లో
నలుపెన్నో తెలుపెన్నో తెలుసుకునిరా అంటూ..
గుండె గోడూ
కాలానికి పట్టదు
గోడ గడియారం
చేతి గడియారం
కాలానికి కొలమానాలూ కావు
ఖచ్చితమైన మెట్లు అవే
స్వార్థం వేలు పట్టుకుని నడిచే అడుగులే
గుచ్చుకునే క్షణాల ముల్లు అదే
ఒక్కో మాటలో తనని తాను ముంచుకుని
స్వార్థం అద్దకం లా
జీవితాన్ని వాటెయ్యాలని చూస్తున్నపుడు...
కదలని అంకెల్లా
ప్రేక్షక పాత్రవ్వాలంటే
ఎంతకష్టం..
******
https://www.facebook.com/groups/kavisangamam/permalink/663909283661827/?notif_t=like
https://www.facebook.com/jayamurli/posts/10200184330931446?comment_id=4685025&offset=0&total_comments=16¬if_t=feed_comment
Comments
Post a Comment