అక్షరాలకే అలుపొస్తే... -- Jayashree Naidu
అలసిపోయాయి...
భావాల్ని మోసీ
మనసుల్ని ఇటుకలు చేసి
కోటల కవితలు దాటి
అలసిపోయాయి...
అక్షరాలకి జోల పాట కావాలిప్పుడు...
స్పందనల చినుకుల్లో
మనసుల్ని ముసురేసే జోలపాడాలి
అటూ ఇటూ
ఎటుపడితే అటు
కనిపించినవీ
కానరానివీ
ఊహల్లాంటివి
ఊహల్లోనివీ
ఎన్నిటినో మోసుకొచ్చిన వేళ
ఊయల సిద్ధం చెయ్యాలి
అలలైన ఆనందాలు
కలలైన ప్రేమలూ
లోకపు ద్వంద్వాలూ
అన్నివైపులా అతించుకు మెరిసిన అక్షరాల
రెప్పలు వాలుతున్నాయి
మౌనపు తలగడ సరిచేసి
ఆకాశపు దుప్పటి కప్పి
చంద్రుడి బెడ్ లాంప్ వెలిగించండి
వెన్నెల తలవాకిట కాపలా వుంచాలి
పాలపుంత లో కలల పిక్నిక్ కి వెళ్ళి
విశ్వాల వసంతంలో సేదతీరుతాయి
ఉదయాన్నే....
సూర్యుడిలో శబ్దాలన్నీ వెలిగించుకుని
కిరణాలతో రీ-చార్జి చేసుకుని
తూర్పు సముద్రంలో స్నానించి
అలల తుంపరల్లా నా చెక్కిలి స్పృశిస్తాయి..
మళ్ళీ మళ్ళీ స్నేహిస్తాయి.
-ఝయష్రీ ణైదు
భావాల్ని మోసీ
మనసుల్ని ఇటుకలు చేసి
కోటల కవితలు దాటి
అలసిపోయాయి...
అక్షరాలకి జోల పాట కావాలిప్పుడు...
స్పందనల చినుకుల్లో
మనసుల్ని ముసురేసే జోలపాడాలి
అటూ ఇటూ
ఎటుపడితే అటు
కనిపించినవీ
కానరానివీ
ఊహల్లాంటివి
ఊహల్లోనివీ
ఎన్నిటినో మోసుకొచ్చిన వేళ
ఊయల సిద్ధం చెయ్యాలి
అలలైన ఆనందాలు
కలలైన ప్రేమలూ
లోకపు ద్వంద్వాలూ
అన్నివైపులా అతించుకు మెరిసిన అక్షరాల
రెప్పలు వాలుతున్నాయి
మౌనపు తలగడ సరిచేసి
ఆకాశపు దుప్పటి కప్పి
చంద్రుడి బెడ్ లాంప్ వెలిగించండి
వెన్నెల తలవాకిట కాపలా వుంచాలి
పాలపుంత లో కలల పిక్నిక్ కి వెళ్ళి
విశ్వాల వసంతంలో సేదతీరుతాయి
ఉదయాన్నే....
సూర్యుడిలో శబ్దాలన్నీ వెలిగించుకుని
కిరణాలతో రీ-చార్జి చేసుకుని
తూర్పు సముద్రంలో స్నానించి
అలల తుంపరల్లా నా చెక్కిలి స్పృశిస్తాయి..
మళ్ళీ మళ్ళీ స్నేహిస్తాయి.
-ఝయష్రీ ణైదు
Comments
Post a Comment