అనామికలు 1
తెలిసిన తనం వెనుకే తెలియని చీకటి
వెలిగించే కొద్దీ కరిగిపోతుంది
తెలిసేలోపునే మరో ఉదయం
చీకట్లను తుడిచె తలపులకి
మనసు స్పంజికి మెరుపు తళుకుల చెక్కిలి చెమ్మ
సంధి కుదిరిందా...???
సాయంత్రపు నీడల్లే
ఆ శాంతి అశాశ్వతమే
ధృవపు మంచల్లే చుట్టుకునే గుండె ఘోష
మొలకెత్తే ఆశకి చీడలా అంటక ముందే
తుడిచేసి గతాన్ని
కొన్ని వెలుగుల్ని దాచుకుంటాను
-- 24-04-2014
Comments
Post a Comment