|| సంశయాత్మా... ||
వీధిలో రెపరెపలాడుతున్న
ఆకుల పోగుల్ని చూసి
చెట్టుకున్న వసంతాన్ని
ఎవరో లాగేసుకున్నారని బాధెందుకు
మట్టిలోని తడితనం
మొలకలవుతుందనుకునే ఆశలు
పొడిబారిన పగుళ్ళు చూస్తూ
అందని దారుల్లో వెతుకులాటలవుతాయెందుకు
దారటూ మొదలయాక
దూరాలంటూ సాగాక
అడుగుల గురుతులడగద్దనే పాదాలెందుకు...
కొన్ని క్షణాలు బాకులవుతాయెందుకూ....
జయశ్రీ నాయుడు
25-06-2014
ఆకుల పోగుల్ని చూసి
చెట్టుకున్న వసంతాన్ని
ఎవరో లాగేసుకున్నారని బాధెందుకు
మట్టిలోని తడితనం
మొలకలవుతుందనుకునే ఆశలు
పొడిబారిన పగుళ్ళు చూస్తూ
అందని దారుల్లో వెతుకులాటలవుతాయెందుకు
దారటూ మొదలయాక
దూరాలంటూ సాగాక
అడుగుల గురుతులడగద్దనే పాదాలెందుకు...
కొన్ని క్షణాలు బాకులవుతాయెందుకూ....
జయశ్రీ నాయుడు
25-06-2014
Comments
Post a Comment