ద్వైతమే అంతా..

https://www.facebook.com/jayamurli/posts/10201445813827730?notif_t=like

https://www.facebook.com/groups/kavisangamam/805817679470986/?notif_t=like
ద్వైతమే అంతా..
మూగ మనసు గదిలో
సుఖదుఃఖాల తెరలౌతుందపుడు...

అనుభవాల మల్లెలు విచ్చినపుడు
అద్వైతం పూలలో దారంలా
కనిపించని నిజమౌతుందపుడు...

పాదాలను
అలలు తాకుతూ వుంటాయి
సముద్రం మనలో నిద్రలేస్తుందపుడు

గుప్పెడంత ఆకాశాన్ని
కన్ను నింపుకుంటుంది
పాలపుంత గుండెలో విచ్చుకుంటుందపుడు...

విరుల లేతదనం
సుగంధమై తాకుతుంది
నిలువెల్లా ప్రకృతైనట్టుందపుడు...

అడుగులై దూరాల్ని
ఓదారుస్తుంటాను
కణకణమూ మనమై కలిసినట్టుందపుడు...

విడిపోయి
ప్రపంచంలో భాగమౌతాము
విడిపోని
మన ప్రపంచపు స్పందనగా అనుభవమౌతుందపుడు...

*****  ***    *****



Comments

Popular Posts