శివారెడ్డి గారి కవితా ప్రవాహ వెన్నెలలు
అక్షరాల వెన్నెల్లూ, ఆర్ద్రతల చందమామలూ, ఆవేశపు ఉప్పెనలూ, ఆకాశం అచ్చెరువై నక్షత్రాల చెరువులో మనసుని మునకలు వేయించి అట్టడుగుకు లాక్కుపోయి ఊపిరి తిప్పనివ్వక, అంతలోనే నవ్వుల తామరలూ చేతికిచ్చి చూస్తూండగానే మూడు గంటలకాలం "శివుడి" కవితా తాండవ కేళిలా గడిచిపోయాయి.
శివారెడ్డి గారి కవితల ఆంగ్ల అనువాదాలు తెలుగంత సహజంగా అనువదించిన పెద్దలు - అల్లాడి ఉమ, శ్రీధర్, జయలక్ష్మి, హర్ష గార్లు, ఇంకా శివారెడ్డిగారి కవితలు చదివి వాటిని హిందీలోకి అనువదించిన సరిత సుందరిగారు ఒక్కొక్కరుగా చదివిన తీరు ఒక కవి కవిత్వం మీద ఎంత ఆపేక్ష వుందో అని మనసు ఒక్క నిమిషం ఆశ్చర్యం లొ మునిగి.. చటుక్కున ఆ కవితా ధారలో ఆంగ్లమైన తెలుగైనా... భావం దాని బలం అనిపించింది.
ఇక శివారెడ్డిగారి కవితా పఠనం విషయానికి వస్తే, ముంజేతి కంకణానికి అద్దం చూపినట్టే.. నాకు ఇది మొదటి సారి ఆయన కవితా పఠనం వినడం. ఒక్కో కవితనీ ఆయన చదివే తీరులో - పదాల్ని పసి పాపలా మనకి పదిలంగా అందిస్తారు., ఎలా లాలించాలో నేర్పుతారు, అంతలోనే కదను తొక్కే గుర్రాలుగా మాఋచి వాటిచేత పరుగులు పెట్టిస్తారు. తిరిగి, తిరిగి, శ్రోతను తనతో బాటుగా తిప్పి, మనుషుల్నీ, మనసుల్నీ అబద్ధాల్నీ, నిజాల్నీ, ఇజాల్నీ చూపించి ఆహా మహాద్భుత అక్షర ప్రపంచమొయ్ కవీ అని అనుకునేంతలో, నాదేముందీ సామాన్యుడినీ, అవన్నీ చూసిన ఘనత నీదే అని శ్రోతల మనస్సులకు శిరసు వంచి నమస్కరించే వినయం ఆయనకే చెల్లు.
భావాలు నింపని, వొంపని అక్షరాలు లేని కవిత వుండదు ఆయన మనసు పేజిల్లో. "బ్రతికున్న మనిషి తన గుండెని తీసి అరచేత పట్టుకుని తానే చూసుకోవడం ఒక్క కవిత్వంలోనే, కవికి మాత్రమే సాధ్యం" అంటారాయన
అలా అని తానేమీ భావ సామ్రాజ్య విశ్వవిజేత కాదు, కవిత్వం రాసేటపుడు మాత్రమే కవిని, మిగితా సమయాల్లో సామాన్యుడుని మాత్రమే అనడం ఆయన ఎర్దీనెస్, వర్దీనెస్ కూడా.
** ఆయన కవితా పఠన సమయం నేనేరుకున్న ముత్యాల్లాంటి భావ సరాలు..
* కవిత్వం అనేది రాసేటప్పుడు మాత్రమే కవి, మిగితా సమయాల్లో సామాన్యుడే
* one who forgets his roots dies as an artiste
* ధ్వంసం చేయదగినదేదీ నీక్కనిపించకపోతే
నువ్వు నిజంగా ధ్వంసం చేయదగిన వ్యక్తివే
* Time produces the poet
We are the poets of the time
* ముద్దు -- రెండు పెదవుల మౌన పరామర్శ
* Reading is like X-ray
Study is like Scanning
* భూమి ఒక నయనం
అందులోంచి నే సారిస్తా
భూమిలో స్నానం చేయడం తెలుసు నాకు
పశువులు తొక్కిన నేలని
పుస్తకంగా భావించడం తెలుసు నాకు!
ఈ మాటలు విన్న తరువాత ఇక రాసే చేయ్యి కూడా మారాం చేసి, సర్వ శక్తులూ ఆయన కవితా పఠనాన్ని ఆస్వాదించడం లొ మునిగిపోయాయి. ఆ పరిసరాలూ, వినే శ్రోతలూ, ఆయన కంఠ స్వరం ఖంగుమంటూ అలా మమ్మల్నందరినీ తనతో తీసుకు వెళ్ళి పోవడమే తెలుసు. లామకాన్ ఉనికి ధన్యమైన క్షణాలవి!
సుధామ, సుమనస్పతి రెడ్డి, నందిని సిద్ధరెడ్డి, ఎన్ వేణుగోపాల్ గార్ల పఠనం మిస్సయ్యాను. చాలా బాధ వేసింది. బట్ ఆదివారం కొన్ని తప్పవు. కవి యాకూబ్ గారు, సుమనస్పతి రెడ్డిగారు కలిసి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ఇది. కాకతాళీయంగా ఆదివారం ఫేస్ బుక్ లో ఆన్ లైన్ లో యాకూబ్ జీ ఇన్వైట్ చేయకపోతే నెను ఒక మంచి కవితాస్వాద మహత్తర అవకాశాన్ని కోల్పోయేదాన్ని. థాంక్ యూ యాకుబ్ జీ.
Many times i heared him, still i feel i missed
ReplyDeletehmm... Hope you would get a chance to enjoy the recitation once again
DeleteThank you Jayasree garu. A very good write up and also thanks for the quotes you collected and posted.
ReplyDeletewith best regards
You are Welcome NSNMurthy garu!
Delete