పరిచయ పయనం

పరిచయాలు ప్రయాణం వంటివి

ఎక్కడ మొదలవుతాయో..
ఎలా మొదలవుతాయో 
ఎంతకాలం ఉంటాయో.. తెలియదు 

ఏ నిమిషం  మనసులు దగ్గరవుతాయో 
ఏ నిమిషం లో వీడ్కోలు వేదన ఎదురవుతుందో... తెలియదు
  
తెలిసీ తెలియని తనమే ఓ అందం  
జీవితం - ఇలాంటి ఎన్నో ప్రయాణాల సంకలనం

నిష్క్రమించిన అనుభవాలు 
రాబోయే అతిథులు 
తోడు నిలుస్తున్న ప్రేమాస్పదులు
ఇవే మన భూత భవిష్యత్ వర్తమానాలు 

Comments

Popular Posts