మాటల్లో మనసు...

దూరం కరిగి దగ్గర గా మారినపుడు సంతోషమే
దూరాలు తివాచీల్లా పరుచుకుపోయే 
దగ్గరి తీరాల్ని చూస్తున్నపుడే
ఆకాశమూ.. భూమీ రెండు కళ్ళవుతాయి

ఎదో సన్నని పగులు
చారిక కట్టింది 
నవ్వు తో అదుముతున్నా
కలల అరువుల కోసం
మెట్లు ఎక్కుతున్నా

సేదతీరడం అలుపు ధర్మం
నీడనివ్వడం మనసు మర్మం
ఆత్మీయంగా హత్తుకున్నట్టే..
అంతలోనే కలల మలుపు దూరమైనట్టే

Comments

  1. చాలా బాగుంది జయశ్రీ గారూ!
    సేదతీరడం అలుపు ధర్మం
    నీడనివ్వడం మనసు మర్మం...
    చాలా చక్కని భావం..
    @శ్రీ

    ReplyDelete

Post a Comment

Popular Posts