Some Days on FB

* ఎప్పటికీ శ్రోత ల్లే సంగీతమూ, విద్యార్థిలా జీవితమూ ఆస్వాదించాలి అన్నదే నాకు ఇష్టం.

*మనసెప్పుడూ.. మారాముల గారాల పట్టి
విజ్ఞత బెత్తంతొ నిలపక పోతే...
జీవితం ఎంత కోల్పోతుందో.. లెక్కకు అందదు!

అప్పుడప్పుడూ.. ఆవాసాన్ని వీడి.. అక్షరాలతో చెలిమి.. 
ఏకాంతంలొ ఆలోచనల పరదాలు సర్దుతూ
నీ సడి మోసుకొచ్చిన చిరునవ్వు సాక్షి
ఆనందం విషాదం రెంటికీ చిరునామా -- నువ్వే 

స్థల కాల ప్రభావాలు కూడ మన బంధాలని నిర్దేశిస్తాయి
at that point known ones too become strangers.. 

ఆకాశం ఒక తెరిచిన హృదయం
లెక్కిస్తున్నా గుండె చప్పుళ్ళు నక్షత్రాలుగా

Days make difference
life needs it!
hours show the moments
heart needs them!

ప్రశ్న నుండి సమాధానానికి, ఆ సమాధానం నుండి మరో ప్రశ్నకీ... అలా ప్రయాణం కొన్సాగుతూనే వుండాలి.. లేకపోతే నిన్న లోనుండి నేటికి నాకు నేను పాతబడిపోతాను. 

ప్రజ్వరిల్లే దివ్యత్వం 
ప్రతి శిశువులోను దర్శిస్తున్నా
జీవితపు క్షణాల్లో శిశుత్వం 
మంచి ని చూసినపుడు కలిగే ఆనందం
మొగ్గ విచ్చుకున్నప్పటి సుగంధమంత నిజం 

కలతపడిన వేళలో 
భుజాన చేయి వేసి 
నేనున్నాననే మనసు చాలు 

జీవితాన్ని ప్రేమించడం ఇన్నాళ్ళు ఎందుకు తెలియలేదూ.. 
అదో గొప్ప వరం.. 

మాటలో యేముందనుకుంటాం కానీ
మాటలోనే అంతా వుంది
అన్నిట్నీ కప్పడం నేర్పుతుంది
దుఖ్ఖం సంతోషం లాగా
సంతోషం దుఖ్ఖం లాగా
అసహనం సహనం లాగా
ద్వేషం ప్రేమలాగా పలుకుతుంది.

పదం పెదవి కింద 
ఇంకేదో దాపుగా నవ్వుకుంటుంది

Afsar ji's *ఊరి చివర* లో *పసికాళ్ళు నీవీ నావీ!* కవిత లోంచి 

సమస్యలకి పరిష్కారాలుంటాయి.. 
దొరకనప్పుడు.. సృష్టించుకోవడమే
నిబ్బరం గా నిజాన్ని చూసినపుడు
అక్కడే లీలగా మనకు దారీ కనిపిస్తుంది
అది అయిష్టమైనది అయినపుడే
మనసు కళ్ళుమూసుకుని..
దారి లేదంటూ బుద్ధి ని హిప్నటైజ్ చేస్తుంది... 

ఒక నిశ్శబ్దాన్ని ఆవిష్కరించాలని 
మాటలన్నీ మూటకట్టి భుజాన వేసుకు
వెళ్ళే మనసుకు ఎంత కష్టం
నీ ఆలోచనల్లోనేకదా నాలో ఉదయం 

పుస్తకాలు చదవడం అనేది ఒక సముద్ర ప్రయాణం లా అనిపిస్తోంది.. అనంతం గా పరుచుకు పోయిన ఆకాశాన్ని చూడాలా.. అలల పోట్లు ఆటలాడే నీటిని కంట కనిపెట్టాలా... దూరంగా కనిపించే దీవి కేసి తెరచాప సర్దాలా.. అనట్టు.. ఒక పుస్తకం తో మొదలు పెట్టాను అనుకునేలోగా పది మంచి పుస్తకాలు చిరునవ్వులు ఒలికించెస్తూ కళ్ళని తమ వైపు లాగేసుకుంటున్నాయి.. 

అర్థం కానివి ఎన్నో వుంటాయి. అంతమాత్రాన అవన్నీ వ్యర్థాలే అనుకోవడం మన అహంకారమే. అర్థం చేసుకోవడానికి మనమే ప్రయత్నించాలి తప్ప.. ఎవరో వచ్చి అర్థం చెప్పాలి అనడం అసమంజసం. ఎందుకంటే ఎదురు వాదనతోటి దాడి చేయడానికి మెదడులో తగినంత తర్కం రెడీగా వున్న మనుషులం. మెదడుతో కన్నా హృదయం తో అర్థం చేసుకోవడం తేలిక. 

ప్రతి రాత్రీ ఒక ప్రశ్నకు ప్రయాణం పలుకుతుంది..
అతిధిగా వచ్చిన పగలు మరో ప్రశ్నకు నాంది అవుతుంది.. 
ప్రశ్న నుండి ప్రశ్నకు ప్రయాణమే జీవితమేమో 

*


Comments

Popular Posts