మనిషి


మనిషి తనను తానుగ ఎప్పుడూ చదువుకునే పేజీ. అర్థమయ్యిందా సరే లేకపోతే అశాంతే.. లోపలా బయటా కూడా.

తన చుట్టూ పోగేసుకున్న పేజిల్లోంచి తలా కాసిన్ని అక్షరాలు కలుపుకుంటాడు

తన ఆలోచనలతో కలిసిన అక్షరాల్లో కి తొంగి చూసి ఆప్తులంటాడు
ఆ మురిపెము కాస్సేపే

అవే అక్షరాలు అకస్మాత్తుగా యే ఉత్తర ధృవం మీదనో ప్రత్యక్షం అవుతాయి
నీ మీదే తిరుగుబాటు బావుటా ఎగుర వేస్తాయి
అప్పుడేం చేస్తావొయ్ మనిషీ

పేజీ శుభ్రం చేద్దామని
కొత్త అక్షరాలు పోగేస్తావు
ఉదయాన్నే కరచాలనం చేస్తావు
గర్వంగా మరో పేజీ తిప్పుతావు

నిజలెప్పుడూ ముందు పేజీల్లోనే వుండవు
మూలల్లో దాక్కుని నీ నిజాయితీ సిరా కోసం చూస్తుంటాయి

వంచన స్కెచ్చి వేసి మూలల్ని మూసినా
మనసు వాస్తు దాగదు
ఆకాశం లాంటి ఆత్మ ని
యే తాటాకు పందిరితోటి కప్పుతావు
కుందేళ్ళలంటి అబద్ధాల చప్పుళ్ళ హోరు
నిజాయితీ సముద్రపు ఘొష ముందు బలాదూర్

Comments

  1. నిజలెప్పుడూ ముందు పేజీల్లోనే వుండవు
    మూలల్లో దాక్కుని నీ నిజాయితీ సిరా కోసం చూస్తుంటాయి...
    well said Madam..

    ReplyDelete
  2. వినాయకచవితి శుభాకాంక్షలండి,

    ReplyDelete

Post a Comment

Popular Posts