I Me Myself

23-09-2012

నా దృష్టి లో ఒక రచయిత/కవి/కవయిత్రి ఎప్పుడూ ఒక పచ్చటి మొక్క.. అది ఎవరి కోసమో పెరగదు.. పూలు పూయదు.. పండ్లు కాయదు! తన చుట్టూ వున్న గాలి వెలుతురూ నీరు అందిపుచ్చుకుని నిశ్శబ్దం గా ఎదిగిపోతుంది. ఒక కవి/రచయిత/కవయిత్రి.. తన వెలుగు తానే సృష్టించు కోవాలి, తన ఆలోచనా మొక్కకు తానే నీరవ్వాలి, మనో వైశాల్యమనే కిటికీలు తెరుచు కోవాలి. అందరి కవితలూ/రచనలూ చదువుతూ ఆలోచనలు పంచుకోవాలి... ఏకం కావాలి, మమేకం కావాలి.

Whenever I fail in anything I become my teacher.. teach myself. This always helps me to keep my mind open and ready to learn!

ocean of vibes fill every atom
no more its me
the energy fills n flows
they converge 
and settle!

25-09-2012

words r like wilderness...natural n raw! 
for each frnd I made a garden to fit the fragrance!!

నీ తోడు... మాట నుంచి మౌనం వరకు ప్రయాణం 

యే భావమూ ఉదయించని
యే ధ్వనీ వినిపించని
యే చీకటీ స్పృశించని
ఓ అంతరంగ లోకం 

ఇవ్వడమే కాదు తీసుకోవడమూ ప్రేమే
మెప్పించడమే కాదు నొచ్చుకున్నా ప్రేమే
నవ్వడం లోనే కాదు కన్నీటిలోనూ ప్రేమే

నన్ను నేనే ప్రేమించడం నిన్ను ప్రేమించడమే!

26-09-2012
The knowledge to react, respond and reach out for SELF.. may be the essence of inner silence..! 
వున్న దానిలో లేకపోవడమూ.. లేనిదానిలో వున్నామన్న స్పృహ
దృశ్యా దృశ్య భావన... చెరిగిపోయిన గీతల గమనం
లోపలా బయటా
విస్తరిస్తూ.. సంకోచిస్తూ..
అనంతం - ఒక అనుభవం!
* నిన్నటి నేను దాటి ఎన్నో అడుగులు 
నాలో తొలుచుకుంటూ వెళ్ళిపోయిన కలల మడుగులు
అందీ అందక రాసీ రాయని పాటల కలం కాలం
గోరింటాకు జాడలా ఆశలు మిగిల్చిన ముద్రలు
నీ జ్ఞాపకాల్లా నా అణువణువూ శోభిస్తోంది

కవిత రాయడం ఒక ఎత్తైతే,దాన్ని ఎడిట్ చేసుకోవడం కూడా అంతే ముఖ్యం.ఎవరైతే,ఈ అంశాన్ని గుర్తిస్తారో వారు కవులుగా ఎదగగలుగుతారు అని నా నమ్మకం.! -- Kavi Yakoob ji

Comments

Post a Comment

Popular Posts