ప్రయాణపు నిట్టూర్పు

ప్రయాణం ఒక బాధ్యత
మరిచిపోకుండా కావలసినవి తీసుకెళ్ళూ అని

ప్రయాణం ఒక హెచ్చరిక
వెళ్ళేటప్పుడు భద్రం సుమా అని

వెళ్ళిన దగ్గరి నుండీ తిరిగి ఇల్లు చేరే ఆతృత

యేవైనా మరిచావో ఇంతే సంగతులనే వెక్కిరింత!

కానీ
హెచ్చరికలూ మొదలూ ముగింపులూ చెప్పని ప్రయాణాల్ని
యెవరు సృష్టించారొ.. యెందుకిలా అనీ
వెళ్ళిపోయిన వాళ్ళని చూసి ఒక నిట్టూర్పు గుండెలో తన ప్రయాణం మొదలెడుతుంది!

Comments

Popular Posts