వెతుకులాట..



నీతో.. నీలో.. నన్ను నేను పోగొట్టుకున్నానేమో.. అందుకే యీ వెతుకులాట.. భయమూ బాధా

నువ్వుగా నువ్వెప్పుడూ వుంటావు.. 
అదే నాకు నీ పాఠం..
నాకోసమై వెతుకుతున్నా.. సౄష్టించుకోవాలో.. తప్పిపోయానో కూడా తెలీడం లేదు..

కొన్నిటిని భద్ర పరుచుకోవాలి..
కొన్నిటిని కత్తిరించాలి
మరి కొన్ని పంచెయ్యాలి..
నా మౌనంలో నా మాట వినిపించినప్పుడు..
నీ మాట లేకున్నా నీకోసం నవ్వగలను..
నువ్వవ్వగలను... అప్పటి కోసం ఎదురుచూస్తా

Comments

Popular Posts