సయొనారా లేని స్నేహమా -- జయశ్రీనాయుడు
In memory of a wonderful friend...
కొన్ని కాలాలుగా ఘనీభవించిన సమయాలు
జ్ఞాపకాలుగా అతిథులౌతాయి
సమయాలై ప్రయాణించిన రహదారుల కిరువైపులా
మన మాటల ఆకుల్ని తొడుక్కున్న వృక్షాలు
ఇప్పటికీ పచ్చగానే వున్నాయి
నన్ను చూసి నువ్వవుతున్నాయి...
చిక్కటి కాఫీ ఆఘ్రాణిస్తూ
వుయ్యాల బల్ల మీద కూర్చుని
పరస్పరం కలబోసుకున్న ఆప్యాయతలూ
ఆదివారపు మధ్యాహ్నాల విరామ చిహ్నాలవి...
కొసరి కొసరి చేసే వడ్డనలో ఆ పెద్దరికం
అరమరికలు లేని ఆప్యాయతలా ఆ విందు భొజనం
అహంకారం లోనూ...ఆత్మవిమర్శ గుప్పించే గడుసుదనం
దూరం లోనూ... లీలగా స్ఫురింపచేసే దగ్గరితనం...
జీవితంలా మళ్ళీ ఎపుడు ఎదురొస్తావో...
రావని తెలిసీ ఎదురుచూపులవ్వడం
అదీ ఓ తీపి దనపు ఉనికేకదా...
సయొనారా లేని స్నేహంలా ప్రవహిస్తుంటావు
దాచుకున్న మరపులా వుంటావు
ఎప్పుడో నడిచొచ్చిన జ్ఞాపకం
నాదగ్గర ఆగి పలకరిస్తుంది
నువ్వై మిగిలిన కాలంలో
మనం ఇంకా కలిసే వున్నామనిపిస్తుంది!
*** sayonara - a farewell remark; "they said their good-byes"
కొన్ని కాలాలుగా ఘనీభవించిన సమయాలు
జ్ఞాపకాలుగా అతిథులౌతాయి
సమయాలై ప్రయాణించిన రహదారుల కిరువైపులా
మన మాటల ఆకుల్ని తొడుక్కున్న వృక్షాలు
ఇప్పటికీ పచ్చగానే వున్నాయి
నన్ను చూసి నువ్వవుతున్నాయి...
చిక్కటి కాఫీ ఆఘ్రాణిస్తూ
వుయ్యాల బల్ల మీద కూర్చుని
పరస్పరం కలబోసుకున్న ఆప్యాయతలూ
ఆదివారపు మధ్యాహ్నాల విరామ చిహ్నాలవి...
కొసరి కొసరి చేసే వడ్డనలో ఆ పెద్దరికం
అరమరికలు లేని ఆప్యాయతలా ఆ విందు భొజనం
అహంకారం లోనూ...ఆత్మవిమర్శ గుప్పించే గడుసుదనం
దూరం లోనూ... లీలగా స్ఫురింపచేసే దగ్గరితనం...
జీవితంలా మళ్ళీ ఎపుడు ఎదురొస్తావో...
రావని తెలిసీ ఎదురుచూపులవ్వడం
అదీ ఓ తీపి దనపు ఉనికేకదా...
సయొనారా లేని స్నేహంలా ప్రవహిస్తుంటావు
దాచుకున్న మరపులా వుంటావు
ఎప్పుడో నడిచొచ్చిన జ్ఞాపకం
నాదగ్గర ఆగి పలకరిస్తుంది
నువ్వై మిగిలిన కాలంలో
మనం ఇంకా కలిసే వున్నామనిపిస్తుంది!
*** sayonara - a farewell remark; "they said their good-byes"
Comments
Post a Comment