కొన్ని పునర్జన్మలు

 కొన్ని జ్ఞాపకాలు
సమాధి గోడల్ని చీల్చుకు వొచ్చే మర్రి మొలకలు

మెలకువని నిద్రపుచ్చే
స్వప్న గమకాలు

మయసభలాంటి
మోహ శిధిలాలు

 జ్ఞాపకాలెప్పుడూ ప్రతిద్వనిజనితాలే...

ప్రతిధ్వనుల్నీ
శృతి బద్ధం కమ్మంటే
రాగాలాపన వికృతమే

నిన్నని నేటిలో వెతుకులాట ఒక పెనుగులాట
లేనిది నిజమనుకోవడమొక మోహం

పదాలతో వీడ్కోళ్ళ విత్తులెన్ని చల్లుకున్నా
మనసులో నాటుకోవని తెలిసీ
 కాలం బీడుపోక
చిగుళ్ళేసే వేదనలు కొన్ని

మనసు చావలేదనీ
స్పందన బ్రతికే వుందనీ
ఊరడిస్తుంటాయి...

Comments

Popular Posts