మనసా యూజ్ విత్ కాషన్ !!!
ప్రేమకీ ఎక్స్పైరీ డేట్ వుంటుంది
మనసా యూజ్ విత్ కాషన్ !!!
కోరికల వాగుల ఆనవాళ్ళు మారుతాయి
చిరునామాలూ మారుతాయి
కోరి తలుపు తట్టిన వాక్యాల స్థానం లోనే
నీతో ఏం మాట్లాడామంటావ్ అన్న ప్రశ్నలే ఎదురవుతాయి
కొత్త పాతబడుతుంది
కొత్తదనాలేవీ లెవనుకున్నాకా
కొంచెం కొంచెం మారిపోతావు
మెరుపులే ఆనవాళ్ళైన కళ్ళూ
అలవోకగా చూపులు తప్పించుకుంటాయి
ఆనందం చిరునామా ఐన పెదవుల్లోనూ
ఉదాశీనపు సరళరేఖలే వుంటాయి
ఆర్తి ధ్వనించిన కంఠం
శృతి మరిచిపోతుందీ
గాలికి ధూళి లేచినంతసహజం ప్రేమ
మరి దుమారం ఎటుపోయిందీ
గుండె మారాములేవీ పనిచెయ్యవు
వచ్చివెళ్ళిన కాలం
ఎప్పుడూ సాక్షీ మాత్రమే
ఏ న్యాయస్థానం అక్కర్లేని ఎమోషనల్ ధర్మశాస్త్రం
మనువేం రాశాడో తెలీదుగానీ
మనిషిగా యీ గుండెకి అడ్డుకోత నిలువుకోతలు ఫ్రీగా చెయ్యబడును
ఆశల కోరికల ఆనవాలైనందుకూ నువ్వే ముద్దాయివిక్కడ
యే న్యాయస్థానాలూ యే వైద్యాలకూ అందని
రంపపు కోతల్ని మనసులోనే పొదిగి కిరీటంగా అలంకరించుకో
మోహలోక ఒలింపిక్స్ లో స్వర్ణ పతక గ్రహీతవా
నమ్మకపు ఓటమి ని నిగ్రహించుకుంటున్న విలాపానివా
చూజ్ యువర్ చాయిస్
ఎవరికీ క్షణం ఆగే సమయం లేదిక్కడ
అంతా మానవతా వాద ప్రియులు కదా...
మానవుడా
మానవీయ విలువలకి పట్టం కట్టే మహనీయుడా..
మనసుతో ఆటకూడా ఒక మనోల్లాసమే...
క్రీడా స్ఫూర్తి ప్రకటించండీ...
-- Jayashree Naidu
మనసా యూజ్ విత్ కాషన్ !!!
కోరికల వాగుల ఆనవాళ్ళు మారుతాయి
చిరునామాలూ మారుతాయి
కోరి తలుపు తట్టిన వాక్యాల స్థానం లోనే
నీతో ఏం మాట్లాడామంటావ్ అన్న ప్రశ్నలే ఎదురవుతాయి
కొత్త పాతబడుతుంది
కొత్తదనాలేవీ లెవనుకున్నాకా
కొంచెం కొంచెం మారిపోతావు
మెరుపులే ఆనవాళ్ళైన కళ్ళూ
అలవోకగా చూపులు తప్పించుకుంటాయి
ఆనందం చిరునామా ఐన పెదవుల్లోనూ
ఉదాశీనపు సరళరేఖలే వుంటాయి
ఆర్తి ధ్వనించిన కంఠం
శృతి మరిచిపోతుందీ
గాలికి ధూళి లేచినంతసహజం ప్రేమ
మరి దుమారం ఎటుపోయిందీ
గుండె మారాములేవీ పనిచెయ్యవు
వచ్చివెళ్ళిన కాలం
ఎప్పుడూ సాక్షీ మాత్రమే
ఏ న్యాయస్థానం అక్కర్లేని ఎమోషనల్ ధర్మశాస్త్రం
మనువేం రాశాడో తెలీదుగానీ
మనిషిగా యీ గుండెకి అడ్డుకోత నిలువుకోతలు ఫ్రీగా చెయ్యబడును
ఆశల కోరికల ఆనవాలైనందుకూ నువ్వే ముద్దాయివిక్కడ
యే న్యాయస్థానాలూ యే వైద్యాలకూ అందని
రంపపు కోతల్ని మనసులోనే పొదిగి కిరీటంగా అలంకరించుకో
మోహలోక ఒలింపిక్స్ లో స్వర్ణ పతక గ్రహీతవా
నమ్మకపు ఓటమి ని నిగ్రహించుకుంటున్న విలాపానివా
చూజ్ యువర్ చాయిస్
ఎవరికీ క్షణం ఆగే సమయం లేదిక్కడ
అంతా మానవతా వాద ప్రియులు కదా...
మానవుడా
మానవీయ విలువలకి పట్టం కట్టే మహనీయుడా..
మనసుతో ఆటకూడా ఒక మనోల్లాసమే...
క్రీడా స్ఫూర్తి ప్రకటించండీ...
-- Jayashree Naidu
Comments
Post a Comment