భద్రం చిట్టీ...!
ముందుకో వెనక్కో
మనసు ప్రయాణం
ఇష్టం తో స్నేహం
కష్టం తో కలహం
హృదయపు చదరంగం
నన్ను నేను మార్చుకుంటూ..
కష్టం ఇష్టం అంటూ
హద్దు లేని చోట నిలవాలని
తులాభార ప్రపంచం కి అతీతం కాలేక
అనుక్షణం గుండె చప్పుడు పహరా
నీ చుట్టూ ఆవరించిన నాకు
ఇది వద్దనీ.. అదే ముద్దనీ..
మార్పు తప్పదనీ..ఏవేవో ఆలొచనలు!
దీప స్తంభంలా ప్రేమ భావం
భావతరంగాల ఆటుపోట్లు..
కోపాల కొండరాళ్ళు..
అన్నీ దాటుకుంటూ..
కరిగి కన్నీరైనా నాకు నువ్వే
మురిసి పన్నీరైనా ఆ నవ్వే
భద్రం చిట్టీ అంటూ అంతరాత్మ!
"తులాభారప్రపంచం" , " భావతరంగాల ఆటుపోట్లు" కవితకి ప్రాణంపోసాయి. గొప్ప విషయాన్ని చెప్పటానికి ఎక్కువ రాయఖ్ఖ ర్లేదని ఇలా చెప్పారు.అయినా మీరన్నట్టు అంతరాత్మని కాదని ఎక్కడికెళ్తాంలెండి
ReplyDeleteDev ji..
ReplyDeleteఎంతైన.. అంతర్ ఆత్మ కదా..:)