ఇలాంటివెన్నో...నాలో
* అక్షరాలు అంతరంగానికి అద్దం. అది హింస అయినా.. అహింస అయినా..
యధాతధంగా అక్షరాల్లోకి అనువాదం అయినపుడే మనసు మాట అక్షరానిది అవుతుంది..
* రెప్పవాల్చని మనసులో
నిద్రపోని ఆలోచనల్లో
తప్పొప్పుల జాడే తెలియని ప్రేమ
ఊహల బొమ్మలాటలాడుతూ
రమిస్తోంది నిరంతరంగా...
*reppa vAlchani manasulO
nidrapOni AlOchanallO
tappoppula jADEy teliyani prEma
Uhala bommalATalADutU
rammistondi... nirantaramgA*
* నీదంటూ ఓ లోకం
తీరికలేని ఊహల బాటసారివి...
నీ ఊహల బాటసారినయ్యా
అదే నా నేరం!
*nIdanToo O lOkam
tIrikalEni Uhala bATasArivi...
nI Uhala bATasArinayyaa
adE nA nEram!*
* ఈ రొజు నుండీ తీసేస్తున్నా నాలోని నన్నూ..
రోజూ ఇదే తీర్మానం..
plucking out self
finds another shelf
* ఎన్నొ చందమామల్ని చూపిస్తూ - జీవితం
అందేవాటికన్నా అందనివే ఎక్కువ!
* ప్రేమంటే చెప్పలేని ప్రేమ!
అందులోని విశాలత్వం
నిశ్శబ్దం
నిగూఢత్వం
అనిమేషత్వం
ఆకాశంలా కనిపిస్తూనే ఎన్నో రహస్యాలని దాచుకుంటుంది
అందంగా కలిసిపోయే జ్ఞానమూ అజ్ఞానమూ
పడుగూ పేకల్లాంటి బలమూ బలహీనతా -అన్నీ వుంటాయి.
ఎప్పటికీ అందగించే అనుభూతి!
అవును జీవితంలో అందినవాటికంటే అందనివే ఎక్కువ....అందుకనే కదూ జీవితం ఇంత అందంగా ఉండేది?
ReplyDeleteరెప్పవాల్చని మనసులో
ReplyDeleteనిద్రపోని ఆలోచనల్లో
తప్పొప్పుల జాడే తెలియని ప్రేమ.........
ఈ వాక్యాలు నన్ను ఏదో తెలియని లోకాని తీసుకువెళ్లిపోయాయి
2300 టైమ్ వరకు మెళుకువ వుండేలా చేశాయి ...
ఇంకా ఎప్పటివరకో
Thank you so much Mirza Afroz Baig..
ReplyDeleteసముద్రం లో కెరటానికి తను చేరే తీరం తెలియనట్టు
రాసిన పదాలు యే గుండెలో యే సంగీతాన్ని పలికిస్తాయో తెలీదు..
words of such give inspiration to travel in the ocean of words with more confidence..
దేవ్ జీ..
ReplyDeleteఅందీ అందనట్టూ..
చేరీ చేరనట్టు
ఇదో భావ సంద్రం.. అంతరంగ రాగం