మనసు దారి
మబ్బులు కడిగిన ఆకాశం లా
మనసు దారి
దిగులు, భయము, ఆశ, ఆకాంక్ష
ధూపాల వలల సెగలు
పసి చాయలో అమాయకపు
అరచేతులు చూసుకున్న కన్నీరు
ఒప్పించాలనుకుని
ఒప్పుకోలేని
ఒప్పీ ఒప్పని ప్రేమ
వ్రేళ్ళు పాదుకోని
లతలా హృదయం
నీ అక్షర జలజీవం లేక
శిధిలమైంది..
సమూలంగా పెకిలించాక
ఎక్కడ నిలుస్తుంది..
భావాలన్నీ
పూసుగంధంలా
గాలిలో నిలిచాయి..
వ్రేళ్ళు లేని ఆకుల్లా ఆశలు...
ఇక వసంతమైనా
గ్రీష్మమైనా
గుపిట్లో నీ సుగంధమే!
మనం ఒకటనుకుంటాం.. మనసు మరోటి....ఈ ద్వైదీ భావాన్ని భలే చక్కగా పలికించారు.. మనసు దారే కాదు.. హారతి కూడా పట్టారు.. ఆశ, ఆకాంక్ష ధూపాలేసి... ఎన్ని చేసినా..ఏ దారి చూసినా.. ఎక్కడికి వెళ్ళినా మన మనసు మనప్రేమ లోనే ఉన్నట్లు.. గుప్పిట్లో నీ సుగంధమే అని తేల్చేసారు... భళా జయ గారూ..భళా...నిజంగా కరువుతున్న అమాయకత అంతా కవితలో ప్రతిబింబించారు...చాలా మంచి కవిత..
ReplyDelete