ఇదీ జీవితమే...!



ఒక సంవత్సరం గాప్ తర్వాత మళ్ళీ షాపింగ్ కి శ్రీకారం చుట్టాను.  సమ్మర్ వకేషన్ కి ఈ రొజు ఆఖరు రొజు కావడం తో ప్రొద్దున్నే బుద్ధిగా రైతు బజార్ కి వెళ్ళి కావలసిన వెజిటబుల్స్ తెచ్చుకొవాలని నిన్ననే డిసైడైపొయాను. ప్రొద్దుటే మిగిలిన పనులన్నీ అవతల పెట్టి, ఒక ఫైవ్ హండ్రెద్ (మా ఇంటి దగ్గర మార్కెట్ రేంజికి పదిరకాల కాయగూరలకి అంత పెట్టాల్సిందే)పర్స్ లొ వేసుకుని బయల్దేరాను. ఉదయం పూట అందులొనూ సోమవారం కావడం తో ఖాళీ గానే వుంది. హమ్మయ్య అనుకుంటూ ఒక్కో ఐటం కొంటూ ముందుకెళ్తున్నాను. ఇంటి దగ్గర మార్కెట్లో ఎవైన కేజీ ముప్ఫై కి తగ్గవు. బాగ్ నిండింది, లెక్క చూస్తే ఇంకా వంద దాటలేదు.. షకయ్యాను. మళ్ళీ లెక్కేసుకున్నాను. కరెక్టే.. రైతు బజార్ జిందాబాద్ అనుకుని బైటకు దారి తీస్తున్నాను. అక్కడ పచ్చడి కాయలు ముక్కలు కొట్టే వాళ్ళూ కష్టమర్లతో బిజీ గా వున్నారు.ఒక షాపులొ ఒక ముసలతను (around 65-68) వున్న శక్తినంతా చేతిలొకి తేచ్చుకుని చెరుకు గడల్ని చెక్కు తీసి ముక్కలు కొడుతున్నాడు. 



మిగితా సమయాల్లో అయితే ముసలతను కదాఅతనికెం జబ్బులున్నాయో.. ఆ బాక్టీరియాలు కొని తెచ్చుకొవడం అవసరమా అన్న ఆలొచన తో ప్రక్కకి వెళ్ళిపోయేదాన్ని. కానీ ఎందుకో ఆ నిముషం లో అతను  శ్రమైక జీవన సౌందర్యానికి ప్రతినిధిలా కనిపించాడు. 
శ్యాం బెనెగల్ సినిమా సీను కళ్ళ ముందు వుంది అనిపించింది.




పెదాలు బిగ పట్టి ఆయాసపడుతూ సత్తువంతా పోగుచేసి కత్తి తోటి చెరకు గడ చెక్కు తీస్తున్నాడు. ప్రక్కగా రెండు కవర్లలొ కొట్టిన ముక్కలు పాక్ చేసి వున్నాయి. ఏంత తాతా అని అడిగాను. వంచిన తల ఎత్తకుండా చేస్తూన్న పనిని ఆపకుండానే "పది రూపాయలు" అన్నాదు. నోట్ తీసి ఇస్టూ ఒక పాకేట్ ఇవ్వు అన్నాను. పలకలెదు. గొంతు హెచ్చించి మళ్ళీ చెప్పాను. విసుగ్గా తల పైకెత్తి నువ్వె తీసుకొవచ్చు కదమ్మా అన్నాడు. నిజమె అవి నా చేతికి అందేంత దూరం లోనె వున్నాయి. మా చిన్నాడిని బుజ్జగించే తీరులొ "నీ చేత్తొ ఇస్తే తీసుకుందామని తాతా" అన్నాను చిన్నగా నవ్వుతూ.

 ఆ నిమిషం లో అతని ముఖం లొని విసుగంతా స్పాంజి తో తుడిచేసినట్టుగా మాయమయ్యింది. నవ్వుతూ ఆ పాకెట్ నా చేతికిచ్చి డబ్బులు తీసుకున్నాడు. అతను బోసి నోటి తో నవ్విన నవ్వు ఇంకా నా మస్తిష్కం లొ ఫ్రీజయి వుంది. ఒక నిమిషమైనా సరే తెలియనివారికైనా సరే సహ్రుదయపు ఆనందాన్ని ఇవ్వగలిగిన క్షణాలు చాలా విలువైనవి.  



Comments

Post a Comment

Popular Posts