పదాలన్నీ నిశ్శబ్దం వేపు
ద్రుశ్యాలన్నీ అద్రుశ్యం వేపు
మేనులన్నీ మన్నులో
మన్ను మిన్నులో..
నీవులన్నీ నాలో
ఏనాడైతే ఆ వేపు
ఆ లోపల
ఈ తలపుల తలుపులు మూసుకున్నాయో
అప్పుడే కనిపించావు..
ఒక భావనగా
అంతులేని ఆనందం
అంతం దాటిన అనంతం
దుఖం లొనూ.. దూరం లొనూ ఆనందమే
సంతోషమూ.. సామీప్యమూ.. అనునిత్యమూ
kavitha bagundi.. meenunchi marinni ilaantivi ashistunnanu
ReplyDeleteఅంతరాత్మ నుంచి అక్షరాత్మని దర్శించుకున్న భావన. "అంతం దాటిన ఆనందం" నాకు నచ్చింది. చాలా సున్నితంగా ఉండే మీ పదాలఎన్నిక ఎన్ని భావనలనైనా అమర్చుకుంటూ పోతునేఉంటుంది....కొన్నాళ్ళు గుర్తుండే రచన.
ReplyDeleteమీ ఆత్మీయ స్పందనలు ఎప్పుడూ మరో మెట్టు మీదకు ప్రయాణించడానికి స్ఫూర్తినిస్తాయి.. క్రుతజ్ఞతలు దేవ్ జీ
ReplyDeleteThank you Karanam Lugendra Pillai garu..
ReplyDelete