వన్నెల్లొ వెన్నెల..
చల్లగా మెల్లగా
కరిగిస్తూ
కలబోస్తూ
అందానికి అందనీ
అందమే నీదనీ
అల్లంత దూరాన వున్నా
అరచేతిలొ ఇమిడిపొయి
మల్లెలొ.. మాలలొ
ఆకులో.. ఆక్రుతిలొ
అమ్మ నవ్వులా
ఆప్తబంధువులా
అదాటున లెచినపుడు
హత్తుకున్న గుండెలా
గుప్పిట మూసినా
గుండె ని తెరిచినా
నీకేసి చూసినపుడల్లా
నాకోసం నువ్వున్నావన్న నమ్మకం
అవని అంతా పరుచుకున్నా
గుండె చాలని పల్లవివి
కాలమంతటి చరణానివి
నీ పాటలో రాగమవ్వడం తప్ప
వెన్నెలమ్మా... నీకు వన్నెలెమద్దను????
no english translation for this plz
ReplyDeleteవావ్! మధురమైన భావ వ్యక్తీకరణ!
ReplyDelete