వినోదం


కొంచెం దిగులు

యేదో గుబులు

దూరాలు దగ్గర్లో కొచ్చినందుకా

దగ్గరలు మరిగిపోయి 

ఆవిరి మేఘాలై దూరంగా జరిగినందుకా



జలజల రాలిన సామీప్యాలు

పరిమళమంతా అలా


కరిగిపోతూ జ్ఞాపకంలా దూరంగా.. 

చిరునవ్వుల పెదాలపై పరుచుకుంది 








కౌగిలిగా కిటికీలు తెరిచిన గుండె

మమేకమైన గాఢతలో 

వెలుగుల చుక్కల ముగ్గులేసుకుంది

ఆకాశాల దూరాల్లో యెన్ని రంగవల్లులో



దూరాలన్నీ దుఖాలే కావు

గుండె పునాదుల బలాన్ని కదిపి చూసే 

కాల కంపనాలు 


దగ్గరగా వచ్చి హత్తుకునేది దూరమే.. 

దూరం గడవనిదే దగ్గర దగ్గర కాలేదు 

దగ్గరున్నంతవరకూ దూరంగా తొంగి చూసినవి

దూరమవ్వగానే గుండెలో తిష్ట వేస్తాయి 

మనసు మాయ అంతేనేమో 

మాయావినోదం నాలోనేమో 

-- జయశ్రీనాయుడు 

Comments

Popular Posts