'కలం'కారీతనం

 అన్నీ చదివిన పేజీలే..
కొత్తగా రాసుకుంటాను
క్షణాల సిరా రోజంతా పోగేసి 
సాయంత్రానికి జలపాతం తయారు చేస్తాను

నిలువునా నిస్సహాయత ముళ్ళ గుత్తి మనసుకొచ్చినపుడు
తుంపరల్లా చెంపకు హత్తుకునే క్షణాలు
రెక్కల్తో వాలిన ఓ నిస్తేజ క్షణాన్ని 
వీడ్కోలుగా మార్చింది....

కాలానికి కలమిస్తే 
కలలే కాదూ కల్లలూ ప్రత్యక్షం
స్తంభించిన భావాలు
సాంచీ స్తూపాల్లో నిద్రపోతాయి

దిగులు ముళ్ళెపుడు సిద్ధమే
దూరాల దూకుడులో 
దగ్గరవ్వని సాయంత్రాలకు 
ఆలోచనల చంకీలు కుట్టుకుని మురవడం 

రాత్రి చంద్రుడికి ఫ్రెండ్షిప్ బాండ్ కట్టడమే... 



Comments

Popular Posts