చెంచాడు అజ్ఞాతం...

కొంతసేపైనా అలా వ్యాహ్యాళికి వెళ్ళాలి
ఒంటరి అడుగులే కాదు.. 
జతచేరే మనసులూ స్నేహిస్తాయి
ఓ చిరునవ్వు చిగురిస్తే
మొఖమాటపు పలకరింపు ఆకుల మాటునే అణిగిపోతుంది.. 

అద్దంలో ప్రతిబింబమే నిజం కాదు
ఎదుటి కనుపాపల్లో కొలత తెలియాలి
ఎదుటి గుండె చిరు తెమ్మరల స్పర్శ 
కరచాలనం లోని కమ్మదనం 
మాటల ఆత్మీయతల్లోని దూరాలు
దూరాల్లోనుంచీ పలరించే దగ్గరతనాలూ 



 అప్పుడప్పుడూ.. ..
ఒకింత అజ్ఞాతం ఆహ్వానించాలి...
కొన్ని కొత్త గుమ్మాలు కలుస్తాయి
కొన్ని పాత బిలాలు పూడుతాయి 

ఇబ్బందినీ.. ఇరుతనాన్నీ
వొదిలించే వూపిరి తీయించే
ఓ అజ్ఞాతాన్ని అప్పుడప్పుడూ
ఓ చెంచాడు సేవించాలి

అనేక ఇరుకుతనాలకి
ఇరేజర్ మనమే సృష్టించాలి... 
మనసు విస్తరించాలి.. 
మనను మరిచే క్షణం లో..
ఎన్నో కిటికీలు తెరవాలి.. 

******
https://www.facebook.com/groups/kavisangamam/permalink/663633387022750/?notif_t=group_comment

Comments

Popular Posts