ఆశ పుట్టే వేళ..

 ఎందుకు కోరుకుంటున్నాను...
ఒక మాట
ఒక నవ్వు
ఒక చూపు
ఒక పెదవి వొంపు
లిప్త పాటైన హృదయపు ఆర్ద్రత

రోజులు పోగేసుకునే ఆశలు
నిముషాల్లో భళ్ళున కురిసే వెన్నెల వర్షం
వడి వడి అడుగులవ్వడం.. 
గుండె మట్టం పెరిగుతుంది
వెలుగెంత చీకటెంతని అడగకు
వివరణ వెతికితే కష్టం.. 
ఆశ నిరాశల పికాసో చిత్రమే స్పష్టం 

కక్ష్య లో పరిభ్రమించని గ్రహమే హృదయం 
తోక చుక్కలా వెళ్ళిపోతూనే వుంటుంది..
అరచెయ్యైనా నింపని ఉద్వేగాల తారాధూళే తన చుట్టు....


Comments

Popular Posts