ఒక రాత్రి... మరొక రాత్రి -- కోడూరి విజయకుమార్

"కనుల అంచులు తాకే నిదుర పడవకై ఇలా మెలకువ తీరాన యెదురు చూడవలసిందే యిక,
ఈ రాత్రి నదిని భారంగా ఈదవలసిందే..."
 కోడూరి విజయకుమార్ గారు వ్రాసిన
ఒక రాత్రి... మరొక రాత్రి -- కవితా సంపుటం లోని
అదే శీర్షిక తో వున్న కవితలోని మొదటి నాలుగు వాక్యాలతో మొదలైన ఆ అక్షర స్నేహం  మొదటి పేజీ నుండి చివరి పేజీ వరకూ నిరాఘాటంగా హృదయం వెంట ప్రవహించింది.
 అత్యంత నిరాడంబరమైన వాక్యాల నుంచి భావం ఒక్కో వర్ణంలో కి తర్జుమా అవుతూ, కవర్ పేజీ లోనీ వెన్నెలా, చీకట్ల దోబూచులాట లేదా నిర్మల స్నేహమా అనిపించేలా మనసు తో స్నేహిస్తుంది.  ఆనందాన్ని వెతుక్కుంటూ మనమెటు పారిపోయినా మనసు మాత్రం
గాయపరచిన మాటల శకలాల్ని
ఒకటొకటిగా మోసుకు సాగవలసిందే
అని తీర్మానించేశా రు  విజయ్ కుమర్ గారు.

నిదురపడవ, మెలకువ తీరం, రాత్రి నది... యీ మూడు ప్రతీకలు తర్వాతి కవితల్లో వొచ్చే హృదయ గానానికి ముందు మాటలు మాత్రమే.

మొదటి కవితలో ఇంకా ముందు కెళ్తే,
దోసిపి పట్టిన హృదయం లో తాజా పుష్పమొకటి
ఎప్పటికైనా చేరుతుందని ఎదురు చూడడటం ఒక భ్రమ... అంటారు
సత్యమైనకూడా, ఇతరుల అనుభవాలు నిరూపిస్తున్నా కూడా ప్రతి మనసూ తన చుట్టూ నిర్మించుకునే అందమైన  ఆ కలల కల్లల గూడు ని ఎంతో సున్నితంగా చెప్తారు.

మాయమైన అడుగులూ, వెనక్కి వెళ్ళలేమన్న సత్యం... బొమ్మ బొరుసుల్లాగ నిత్యకృత్యం

ముఖాన్ని కప్పిన తడి చేతులతో
ఒక రాత్రి మరొక రాత్రి...
ఒక కవితా... మరొక కవితా.. అలా ముప్ఫైయారు కవితలూ

సుమధుర గీతంలా సాగుతుందని ఆశించే యాత్ర ఏదైనా
అంతిమంగా గాయాల గానంగా మిగులుతుందనే  ఎరుక 

విజయకుమార్ గారి కవితలన్నిటిలోనూ మనల్ని మునుకలు వేయిస్తుంది.


Comments

Popular Posts