its my life....

08-05-2015

ఏకాంతాలు నావి కానపుడు
హృదయంలో జాడల వెదుకులాటేల.....
ఆశ ఒక అమాయకపు జాలరి
ఎదురుచూపుల తీపి విడలేక
మనసు వేలు వదలక
కరిగి పోయిన నన్ను
తిరిగి ఘనీభవించమంటోంది
నడివేసవిలోనూ కరగలేని
హిమనదంలా.....
******

ప్రకటించాలనే ప్రేమ
ఆర్తితో దాచుకునే గుండె

రెంటి ఉరవడే... అణువణువూ !!!

*****

 ప్రేమ ప్రవాహమైనపుడు మనసు పసిపాపవుతుంది

ఆలంబనే ఆకాశంలా దూరమైనపుడు..

తనకు తానే తల్లవుతుంది 
*****

 మనసు అలసటకి
జీవితపు అపనమ్మకానికీ 
కవిత్వమొక ఆలంబన
*****

 మనసు అలసటకి
జీవితపు అపనమ్మకానికీ 
కవిత్వమొక ఆలంబన

సుగంధాలన్నీ గుండెలో పరిమళిస్తే
అదో మంచుపూలబాట
మరిచిన వసంతాల ఉనికి కోసం
కాలం పరదాల వెతుకులాట

అరణ్యపుదారుల్లో 
అందాల వెంట ముళ్ళు పూస్తాయి
వెన్నెల కూడా భయపెడుతుంది
కలత నిదురైనా
జోలపాటే కలకు తోడవుతుంది! 
***************
 ఏకాంతపు స్పంజి తోటి
తలపుల ఫలకం తేటగీతం

తరచి చూసుకునే మూడోకన్ను
ఎండిన పైరుని పెరికే రైతు

మొలకలయ్యే విత్తనాలని
వెలుగు నీటిలో నిలవచేసి
పచ్చని మనసు కోసం

మరో సేద్యం సిద్ధమవుతోందిక్కడ...






Comments

Popular Posts