లిల్లీ పూల సాయంత్రం
|| లిల్లీ పూల సాయంత్రం ||
-- జయశ్రీ నాయుడు
ధరిత్రిపై తన ప్రేమనంతా
వర్షిస్తున్న సూర్యుడు
వేడిసెగల్లో ఉక్కిరిబిక్కిరి హృదయాలు
అంతా నిశ్శబ్దం
పరిచయపు పరిమళం లీలగా
ఏదీ ఎక్కడా ???
ఓ చిరుతరంగం అంతరంగంలో
ఎవరో ఎక్కడో....
ఇక్కడే వున్నారు
అంతరంగం కనుల్లోంచి ఉబికింది
వాయు పరిమళంతో గుసగుసలాడింది
చెట్టాపట్టాలేసుకుని
చుట్టూరా ప్రవహిస్తోంది
అందరూ ఎవరో ఎవరో
కొందరు తెలిసిన వారూ
అలా ప్రవహిస్తూనే వుంది
వరుస తర్వాత వరుస
కేశపాశాలూ కనుముక్కు తీరులు
అనిమిషమాత్రంగా స్పృశించుకుంటూ...
వాటిని వెనక్కు నెడుతూ
తాను ముందుకురుకుతూ
అదిగో అక్కడా ఆ ముందు వరుసల్లోనే
అంతరంగ ధ్వనులు ఉలికిపడుతున్నాయి
నయనమా మనసుతో చూడు ఇక్కడే ఇక్కడే అంటోంది
స్వచ్ఛమైన జాజి చ్ఛాయ
చిరునవ్వు పరిమళాల లిల్లీ పువ్వు
ఆ రూపమేనా
ఎవరితోనో ముచ్చటిస్తోంది..
రెండువరుసలు ముందుకు దూకిన హృదయం
వెనక్కు తగ్గి ఆ పరిమళం దగ్గరే ఆగింది
ఆమెనే కేంద్రంగా స్థిరపడింది
కళ్ళూ మనసూ అక్కడే ఆగిపోయాయీ
ఆమెనా... ఏమో...
ఉహ్హూ...'ఆ నవ్వు విరిసే దాకా ఆగు
అనుకుంటూంది
ఇంతలోనే పరిచయమైన నవ్వులు విచ్చుకున్నాయి
అంతవరకూ ఉగ్గబట్టుకున్న ఫౌంటేఇన్
వెన్నెల్లా ఎగజిమ్మింది
నాలోనే...
లిల్లీ రోజాల రేకుల కలబోత
ఒక్కసారి గా నా వైపు చూపు ప్రసరించింది..
గాలిలో చేయి ఊపిన సంఙ కు
నువ్వు రాకు నేనే వొస్తున్నా అంది
ఆ అడుగులు వెంట కొంత సందేహపు మడుగులు నాలో
ఇంతవరకూ కలిసిందెన్నడూ లేదూ
ఎలా ప్రతిస్పందిస్తామో ఇద్దరమూ..
చేతిలోకి చెయ్యి తీసుకున్న స్నేహం
అరసెకన్ సందేహమైనా
హృదయం గుర్తించిన నిముషం నుంచీ
జాజీ చంపక పున్నాగలే మా చుట్టూ..
అక్కడో అదృశ్య స్నేహోద్యానం
ఆ సాయంత్రమంతా మెఘావృత ఆహ్లాదమే
మాటలేవీ తోచనీయని ఉక్కిరిబిక్కిరి
సాయంత్రపు నీటి తడికి
మల్లె మొక్క ని ఆవరించి
మట్టివాసన మల్లెల పరిమళాలైపోయినట్టు
దూరాల్లో పెరిగిన ఆత్మీయత
ఆ సాయంత్రపు సౌందర్యం!
జీవితంలో అందమైన అవినాభావావేశాలు
మనకు తెలియకుండానే కాలం పేని ఇచ్చే గుజ్జనగూడు..
కాలమా
కృతజ్ఞతల బొకే కానుకివ్వాలని వుంది
యీ ఆనందపు అనువాదాలే అందుకో..
నా అక్షరాలుగా...
Mythili Abbaraju ఆ అందమైన సాయంత్రాన్నిలా ఫ్రీజ్ చేస్కుంటున్నా...
-- జయశ్రీ నాయుడు
ధరిత్రిపై తన ప్రేమనంతా
వర్షిస్తున్న సూర్యుడు
వేడిసెగల్లో ఉక్కిరిబిక్కిరి హృదయాలు
అంతా నిశ్శబ్దం
పరిచయపు పరిమళం లీలగా
ఏదీ ఎక్కడా ???
ఓ చిరుతరంగం అంతరంగంలో
ఎవరో ఎక్కడో....
ఇక్కడే వున్నారు
అంతరంగం కనుల్లోంచి ఉబికింది
వాయు పరిమళంతో గుసగుసలాడింది
చెట్టాపట్టాలేసుకుని
చుట్టూరా ప్రవహిస్తోంది
అందరూ ఎవరో ఎవరో
కొందరు తెలిసిన వారూ
అలా ప్రవహిస్తూనే వుంది
వరుస తర్వాత వరుస
కేశపాశాలూ కనుముక్కు తీరులు
అనిమిషమాత్రంగా స్పృశించుకుంటూ...
వాటిని వెనక్కు నెడుతూ
తాను ముందుకురుకుతూ
అదిగో అక్కడా ఆ ముందు వరుసల్లోనే
అంతరంగ ధ్వనులు ఉలికిపడుతున్నాయి
నయనమా మనసుతో చూడు ఇక్కడే ఇక్కడే అంటోంది
స్వచ్ఛమైన జాజి చ్ఛాయ
చిరునవ్వు పరిమళాల లిల్లీ పువ్వు
ఆ రూపమేనా
ఎవరితోనో ముచ్చటిస్తోంది..
రెండువరుసలు ముందుకు దూకిన హృదయం
వెనక్కు తగ్గి ఆ పరిమళం దగ్గరే ఆగింది
ఆమెనే కేంద్రంగా స్థిరపడింది
కళ్ళూ మనసూ అక్కడే ఆగిపోయాయీ
ఆమెనా... ఏమో...
ఉహ్హూ...'ఆ నవ్వు విరిసే దాకా ఆగు
అనుకుంటూంది
ఇంతలోనే పరిచయమైన నవ్వులు విచ్చుకున్నాయి
అంతవరకూ ఉగ్గబట్టుకున్న ఫౌంటేఇన్
వెన్నెల్లా ఎగజిమ్మింది
నాలోనే...
లిల్లీ రోజాల రేకుల కలబోత
ఒక్కసారి గా నా వైపు చూపు ప్రసరించింది..
గాలిలో చేయి ఊపిన సంఙ కు
నువ్వు రాకు నేనే వొస్తున్నా అంది
ఆ అడుగులు వెంట కొంత సందేహపు మడుగులు నాలో
ఇంతవరకూ కలిసిందెన్నడూ లేదూ
ఎలా ప్రతిస్పందిస్తామో ఇద్దరమూ..
చేతిలోకి చెయ్యి తీసుకున్న స్నేహం
అరసెకన్ సందేహమైనా
హృదయం గుర్తించిన నిముషం నుంచీ
జాజీ చంపక పున్నాగలే మా చుట్టూ..
అక్కడో అదృశ్య స్నేహోద్యానం
ఆ సాయంత్రమంతా మెఘావృత ఆహ్లాదమే
మాటలేవీ తోచనీయని ఉక్కిరిబిక్కిరి
సాయంత్రపు నీటి తడికి
మల్లె మొక్క ని ఆవరించి
మట్టివాసన మల్లెల పరిమళాలైపోయినట్టు
దూరాల్లో పెరిగిన ఆత్మీయత
ఆ సాయంత్రపు సౌందర్యం!
జీవితంలో అందమైన అవినాభావావేశాలు
మనకు తెలియకుండానే కాలం పేని ఇచ్చే గుజ్జనగూడు..
కాలమా
కృతజ్ఞతల బొకే కానుకివ్వాలని వుంది
యీ ఆనందపు అనువాదాలే అందుకో..
నా అక్షరాలుగా...
Mythili Abbaraju ఆ అందమైన సాయంత్రాన్నిలా ఫ్రీజ్ చేస్కుంటున్నా...
Comments
Post a Comment