దారి తప్పినా తప్పు లేదు...

బుద్దుడు జ్ఞానం పొందాడు.అది అద్భుతం కాదు
అది మనం పొందలేక పోవడమే వింత...''అంటాడు భగవాన్ రజనీష్. 

జెన్ అంటేనే యధార్థం.
అది మనందరి కళ్ళెదుటా ఊంది.
కాని మన కళ్ళను దాన్ని తెలుసుకోడానికి అంకితం చేయలేకపోతున్నాము.
ఒక జెన్ గురువు దగ్గరికి ఒక వ్యక్తి జ్ఞానం గురించి వచ్చాడు.
''జ్ఞానం పొందడానికి ఎంతకాలం పడుతుంది అని అడిగాడూ''.
''ఎంత లేదనా పదేళ్ళు పట్టొచ్చూ''.
''అమ్మో పదేళ్ళా''.
''ఏదో నేను ఊజ్జాయింపుగా చెప్పాను, నిజం చెప్పాలంటే ఇరవై యేళ్ళు కూడా పట్టవచ్చు''.
''ఏమిటి ఒక్కసారే రెట్టింపు చేసారే''.
''ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే ముప్పయేళ్ళు పట్టొచ్చూ'...అన్నాడు గురువు నింపాదిగా...



జ్ఞానం అనేది ఒక గమ్య స్థానం కానీ, ప్రయత్నించి అనుసరించే ఒక లక్ష్యం కానీ కానే కాదు. 
అదొక ప్రయాణం. వట్టి ప్రయాణం మాత్రమే. 
వేగంగా చేసే ప్రయాణం దారిలో దృశ్యాల్ని చూడనీవదు. 
ఏదైనా త్వర త్వరగా నేర్చేసుకుందామంటే ఏదీ సరిగా నేర్చుకోవడం కుదరదు. 
**ఇదిగో ఇదే దారి అంటు ఏదీ లేదు. కనుక దారి తప్పినా తప్పులేదంటుంది జెన్. **
అన్ని నదులు చివరికి కలిసేది సముద్రంలోనే కదా.




Info Courtesy: https://www.facebook.com/pradeep.advaitham

Comments

Popular Posts