మనసున మల్లెల మాల...
ఎందుకో మనసు కి ... భానుమతి గారి కంఠం గుర్తొచ్చింది..
మొదటి సారిగా ఒహ్హోహ్హో పావురమా పాట విని చిన్నపుడు రేడియో ముందు నుంచి పరిగెత్తిన గుర్తు...
నాన్న గారు పోలీస్ బటాలియన్ లో ఉద్యోగం... ఫ్రీ సినిమాలు క్యాంప్ లో...
అప్పుడు మూడో తరగతి చదువుతున్నాను..
మల్లీశ్వరి సినిమా వేస్తున్నారు... ఇంట్లో అందరం హడావిడిగా తయారు అవుతున్నాం..
వారానికో సినిమా... ప్రతి శనివారం అదో ఆనందం...
మల్లీశ్వరి తేరా మీద ప్రత్యక్షం అయింది.. చూస్తున్నాం
అమ్మా నాన్నగారు.. అన్నయ్య.. అక్కలు.. అందరూ సినిమా చూస్తున్నారు..
నేను వాళ్ళందరిని చూస్తున్నాను.. సినిమా ఎంతకీ తరగడం లేదు..
మేఘాలు... చూపిస్తున్నారు.. భానుమతి బావి అంచున కుండ మీద చేయి ఆన్చి ఏడుస్తోంది..
ఎన్టీఆర్ ఉంగరాల జుట్టు తోటి ఆకాశం లోకి చూస్తూ... పాడుతున్నాడు..
అబ్బా... తల నెప్పిగా అనిపిస్తోంది..
ఈ సినిమా అవ్వదా అని ముందుకీ వెనక్కీ చూస్తున్నాను..
ఆ చాన్సు ఎక్కడా కన్పించడం లేదు..
మల్లీశ్వరీ ఎన్టీఆర్ కలిసారు.. కొలను దగ్గర పాట మొదలయ్యింది..
ఇప్పటికీ మల్లీశ్వరి సినిమా అనగానే.. కొలనులో రెండు కలువలు.. భానుమతి ఎన్టీఆర్...
కృష్ణ శాస్త్రి గారి మనసున *మల్లెల మాలలూగెనే* పాట గుర్తొస్తాయి...
పాటలో ప్రతి పదమూ అలా చెవుల్లోంచి.. మనసులోకి రిజిస్టర్ అయిపొయింది..
మల్లెల్ని చూసినా.. భానుమతి గారన్నా ఆ పాటే గుర్తోచ్చేంతగా...
*మనసున మల్లెల మాల లూగెనే కన్నుల వెన్నెల డోలలూగెనే
ఎంత హాయి ఈ రేయి నిండెనో.. ఎన్ని నాళ్ళకీ బ్రతుకు పండెనో..
కొమ్మల గువ్వలు గుస గుస మనినా...
రెమ్మల గాలులు ఉసురుసురనినా..
అలలు కొలనులో గల గల మనినా...
దవ్వుల వేణువు సవ్వడి వినినా..
నీవు వచ్చేవని నీ పిలుపే విని
నీవు వచ్చేవని నీ పిల్యుపే విని
కన్నుల నీరిడి కలయ చూచితిని..
ఘడియ యేని ఇక విడిచి పోకుమా
ఎగసిన హృదయము పగులనీకుమా
ఎన్నినాళ్ళకీ బ్రతుకు పండెనో... ఎంత హాయి ఈ రేయి నిండెనో...*
భానుమతిగారి కంఠంపై మిశ్రమ స్పందనలున్నాయి. సాహిత్యపరంగా బావుంటె తప్ప ఆస్వాదించలేమని కొంతమంది అంటుంటారు. కానీ ఈ పాట ఓ అద్భుతం."నీవు వచ్చేవని నీ పిల్యుపే విని
ReplyDeleteకన్నుల నీరిడి కలయ చూచితిని.." ఈ లైన్లు మరీను...వెంటాడే వాక్యాలంటే ఇవేనూ....ఈ ఆదివారం మంచి పాటతో రోజు ప్రారంభించేలా సాయపడినందుకు ధన్యవాదాలు....
ఈ పాట లో ప్రతి పదమూ మల్లె మొగ్గ విచ్చుకుంటున్న సుగంద పరిమళ భరితం...
ReplyDeleteఆ పరిమళం మీదాక ప్రయాణించి..పదాల్లో విచ్చుకున్నందుకు బోల్డన్ని థాంకులు Dev ji