నాకు నచ్చిన నేను...2

** అక్షరాలనీ ఆశలనీ కూడ పంచుకోలేని స్థితి.. 
నిజమైన ఒంటరితనమేమో..


** I change to a level where I can accept the change as a PART OF me.. But I can't change to that extent where I find its no more ME!



** కొన్ని క్షణాలు గురుతుకు వస్తే..
ప్రపంచం లోని తియ్యదనమంతా వాటి ముందు దిగదుడుపే


** హృదయం కరిగి అణువణువులో కలిసాక
నువ్వూ నేనంటూ.. అంతరాలెక్కడో



** కలల కలం 
నిదుర అరువు కాలంలో..
సిరా లేని పాళీతో.. 
ఆశల కాగితమ్మీద
నువ్వు నిండిన
నవ్వు రేణువుల్ని
విరజిమ్ముతూనే వుంది






** మౌనం లో మాటలుగా 
మాటల్లో మౌనంగా..
ఎండలోని నీడల్లే
ఆ వెచ్చదనం నువ్వేగా


** sometimes the way things/issues contradict surprises me very much.. but when I look back it exposes the underlying positivism in silent action...!



** మన వ్యక్తిత్వం లోని అసంపూర్ణత్వం తొలిగిపోయి
కనిపించని భరోసా మనసు నిండి
ఆ బంధం లోని ఒడిదుడుకుల్ని 
భరించగలిగే సహనాన్ని ఇస్తాయి కొన్ని బంధాలు..




** మాట వినకపోవడం మనసు హక్కా..
దూరమూ దగ్గరా... మనసు మాయా..




** కొన్ని భావాలు పసిపిల్లల్లాంటివి.. 
వాటిని అమ్మలా హత్తుకునే హృదయం అతి కొద్దిమంది దగ్గర వుంటుంది..


** అది బలమో బలహీనతో తెలీదు.. మనసుకు దగ్గరైన వాళ్ళతోటి. అన్ని భావాలూ పంచుకుంటామూ. అకస్మాత్తుగా ఆ ప్రవాహానికి ఆనకట్ట పడినపుడు.మనసు విలవిల లాడుతుంది. అక్కడి నుండీ తేరుకోవడానికి కొంత సమయమూ పడుతుంది..

**నాకు నేను ఎక్కువ ఇష్టం...
అంటే నీ పై కోపం ఉండాల్సిన అవసరం లేనంత ఎక్కువ ఇష్టం...

Comments

Popular Posts