వొస్తూ... ఇస్తూ... నిముషాల గనులు
వొస్తూ తెచ్చేశా అనుకున్నాను
నావెంట నేనే లేనని తెలిసింది..
ఇస్తూ తీసుకున్నానని చిరునవ్వు
కానీ అది కూడా దోచేశావు నువ్వు
నువ్వెళుతూ తీసుకెళ్ళిన
ఆ నిముషాల గనులు
బాధా లేదూ..
బెంగా కాదూ..
ఎదో నిండుతోందీ
బాధ అలవాటుగా మారిన భావమా
మౌనం కూడా మూగవోయిన వేదనా
ఎవరంటూ ఆ స్వరాలూ
ఖాళీ గదిలో ప్రతిధ్వనిస్తూ
నిన్నే వెతుకుతూ
నాలో చూస్తూ
నింగీ లేదూ
నేలా కాదూ
వున్నానా
విన్నానా
విడుదలయ్యానా
నీనుండి నాలోకి
నేననుకునే లోలోకి..
నీనుండి నాలోకి
ReplyDeleteనేననుకునే లోలోకి..
చక్కని భావం...@శ్రీ