ప్రేమ



బాధని భరించే క్రమం లో..
దానికన్నా ఒక మెట్టు పైకి వెళ్ళి చూస్తే..
ఆ కనిపించేది అబద్ధం ఎలా అవుతుంది..

ప్రేమ అన్నది మన అనుభూతి..
అది యే సోర్స్ నుంచి మనలోకి ప్రవహిస్తుందో.. అది ప్రేమకు జన్మ స్థానం..

ప్రెమించాలంటే ప్రేమించే హృదయం వుండాలి..
దాన్ని అంతే వేవ్ లెంగ్త్ తోటి రిసీవ్ చేసుకునే మరో హృదయమూ వుండాలి..

ప్రేమ గురించిన అన్ని విషయాల గురించీ ఎంతైన వివరణలు ఇచ్చుకోవచ్చు. బట్ ప్రేమకి/ప్రేమ express  చేయడానికి తీరిక అనేదీ కూడా వుండాలన్న కాన్సెప్ట్ ఎంత తల బద్దలు కొట్టుకున్నా అర్థం కావడం లేదు..

అది బలమో బలహీనతో తెలీదు.. మనసుకు దగ్గరైన వాళ్ళతోటి. అన్ని భావాలూ పంచుకుంటామూ. అకస్మాత్తుగా ఆ ప్రవాహానికి ఆనకట్ట పడినపుడు.మనసు విలవిల లాడుతుంది. అక్కడి నుండీ తేరుకోవడానికి కొంత సమయమూ పడుతుంది.. My only request is don't become a stranger to those whom u give place in your heart. Its only we are gifting them pain.. an unbearable one...



ఆలోచనలు తెగక.. తగ్గక.. నేను పెట్టిన స్టేటస్ కి పూర్ణిమ ఇచ్చిన జవాబుతో.. సంశయాత్మా వినశ్యతి అయిపోయింది.. వారం రోజుల నా అవస్థ వర్ణనాతీతం.. హాట్సాఫ్ టు పూర్ణిమ...
Poornima Siri: అసలు అడ్డుకట్ట ఎందుకు పడిందో ఆలోచించాలి కదా...అయినా మన భావతీవ్రతలకు మనమే బాధ్యులం కాదంటారా?? కొంత సమయం దాటాక వాళ్ళకి వాళ్ళ సమయాన్ని అపాత్రదానం చేస్తున్నానేమో అనిపిస్తుంది కాబోలు అందుకే మెల్లి మెల్లిగా దూరం అవుతుంటారు...అది మన మానసిక సంతులనాన్ని అది ఎక్కువ గా ప్రభావితం చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే...


ME: అవతలి వాళ్ళ మీద అంత బ్లేమింగ్ చెయ్యలేను that somewhat hurts me more that I became so blind not to notice it :) నువ్వన్నట్టు ఇమోషనల్ బాలెన్స్ కోసమే ఈ ప్రయత్నం.. అక్షరాల్లో ఒలికాక మనసుకు ఊరట దొరుకుతుందని.. అప్పుడిక అంత ఆందోళనలూ వుండవు...


Poornima Siri: హ్మ్...అది బ్లేమింగ్ ఏమి కాదు జయా...నాకు నేను ఎక్కువ ఇష్టం...అంటే నీ పై కోపం ఉండాల్సిన అవసరం లేనంత ఎక్కువ ఇష్టం...ఎందుకంటే ఆ కోపం కూడా నా మనసుని ఒక క్షణం విలవిలలాడిస్తుంది కదా...ఇలా నేను అలవర్చుకున్నాను...మరి నాకయితే హాయిగానే ఉంది..




:) Sometimes it takes a bird eye view to understand emotional complexities... and the outsiders are the best helpers in this.

Comments

Popular Posts