పూర్ణేందు బింబం


క్షణమూ అసంపూర్ణమే

గుండె చప్పుడూ పికాసో చిత్రమే


రాలిన ఆకుల్ని లెక్కిస్తూ...

మొలిచే చిగుళ్ళ జాడలు మరుస్తూ


ఇసుక కరిగించి దాచుకున్న అడుగులు

తవ్వి తవ్వి వెతికే గతమా...

 నీకందని ఆశల్ని 

కలల వర్షంతో తడిపి




 తొలిపొద్దు విత్తులు మొలిపించి

నీరంటి నవ్వుల్ని పోసి 

బతుకు పాదు సరిచేసి


పందిరంటి స్నేహాల్ని నలువైపులా నిలిపిన
గ్రీష్మ వసంతాల నిలువుటద్దం నేను





-- Jayashree Naidu

Comments

  1. తొలిపొద్దు విత్తులు మొలిపించి

    నీరంటి నవ్వుల్ని పోసి

    బతుకు పాదు సరిచేసి


    పందిరంటి స్నేహాల్ని నలువైపులా నిలిపిన
    గ్రీష్మ వసంతాల నిలువుటద్దం నేను...simply superb lines madam..

    ReplyDelete

Post a Comment

Popular Posts