I am Satyabhama



కళాకారుడవ్వడం ఒక కళారూపానికి ప్రతీకగా గుర్తింపబడటం వెనుక ఒక తపన, కృషి ఎంతో వుంటుంది. అలాగే కలిసి వచ్చే కాలం కూడా వుండాలి.

కుగ్రామంలో- ("కుశలవపూడి"లో కాలక్రమేణా కూచిపూడి గా మారిందని బందా గారి అంచనాల ప్రకారం)పుట్టి, బందరులో వారాలు చేసుకుంటూ.. జీవితంలో ఎప్పటికీ మంచి రోజులు రావేమో, తనకు కళా కారుడిగా గుర్తింపు రాదేమో అని దిగులు పడిన హృదయం, సాక్షాత్తూ ఆ సిద్ధేంద్ర యోగి ఆశీర్వాదం పొంది, దేశమే గర్వించేంత కళాకారుడెలా అయ్యాడూ అన్నది.. ఒక ప్రవాహంలా, సత్యభామాభినయ లహరిలా నిముషాలు అనిమేషంగా గడిచి పోయాయి.


Pic Source link: http://www.maganti.org/air/pics/nanduri/49.html

ఒక ఉషగా (ఉషాపరిణయం), దేవదేవిగా (విప్రనారాయణ), తనదైన ముద్రతొ ముగ్ధత్వాన్ని ప్రౌఢత్వాన్నీ అభినయైంచడంలో చేసిన ప్రయోగాలూ, ఆఖరుగా *భామాకలాపం* -- సత్యభామాభినయం తో తనే సత్యభామగా రూపు దిద్దుకోవడం లోని కఠిన శ్రమని ఎంతో తేలికగా తన సహజ హాస్య ధోరణితో ఒక ప్రవాహం లా సాగిపోయింది ఆయన కధనం.

కలాపం అంటే.. ముఖ్య పాత్రధారి ఇంకొక సహాయక పాత్రధారికి జరిగిన విషయాలు వర్ణిస్తూ అభినయించే అంశం. అలాగే సత్యభామా కలాపం లో.. సత్యభామ అతిశయాన్నీ, ప్రౌఢత్వాన్నీ, కృష్ణుడి పట్ల  ప్రేమనీ వివిధ రకాలుగా వర్ణిస్తూ, అభినయిస్తూ  చేసిన అంశాల్ని, అరుదైన ఫుటేజీని చూపడం ఈ డాక్యుమెంటరీ దర్శకుడి విజయం.




సత్యభామగా అభినయించినపుడు వివిధ సందర్భాల్లో ఆయనకు ఎదురైన అనుభవాల్లో హైలైట్ అనతగ్గది ఇదీ -

ప్రేక్షకుల్లొంచి ఒక వ్యక్తి గ్రీన్ రూం దగ్గరకు వచ్చి, సత్యభామ మేకప్ తీస్తున్న శర్మ గారిని చూసి స్థాణువై నిలబడిపోయాడు. ఎవరు మీరని శర్మ గారు ఆరా తీస్తే, ఆయన, అయ్యా ఇందాక స్టేజి మీద సత్యభామగా వేషం వేసింది అమ్మాయనుకుని, నా ఆస్తంతా రాసిద్దామని వచ్చాను, అబ్బాయని తెలిశాక ప్చ్ అని పెదవి విరిచి వెల్లిపోయాడని చెప్పగానే ఆడియెన్స్ లోంచి పెద్ద పెట్టున నవ్వులూ..


డాక్యుమెంటరీ ఆద్యంతమూ శర్మ గారి ముఖతహానే ఆయన కళా పరిశ్రమ లోని ముఖ్య ఘట్టాలు చెప్పించారు. తనికెళ్ళ భరణిగారు ప్రశ్నలు సంధిస్తూ అనుసంధానించారు. చివరగా శర్మగారు తన అన్న దమ్ముల గురించి చెప్పిన తర్వాత అకస్మాత్తుగా వచ్చిన ఫుటేజి తో డాక్యుమెంటరీ ముగియడం కొంత ఆశాభంగమే అనిపించింది.

యేమైనా.. కూచిపూడి కి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన సత్యభామాకలాప కోవిదుడు వేదాంతం సత్యనారాయణ శర్మ గారి అరుదైన నాట్య ప్రదర్శనా ఫుటేజీలు డాక్యుమెంట్ చేయబడ్డాయి. ఇలా ఇంకెంతో మంది కళాకారుల అరుదైన ప్రదర్శనా పటిమను చూపే సందర్భాలు చరిత్రలో కలిసిపోకుండా ఇది ఒక శుభారంభం అని అనుకోవచ్చు.


i am Satyabhama 
Directedby Dulam Satyanarayana






-- Jayashree Naidu




Comments

  1. Thanks for the piece. Ì feel I missed it badly

    ReplyDelete
  2. You are welcome :)

    Yes very rare footage was shown. Great Show it was!

    ReplyDelete

Post a Comment

Popular Posts