Shajahana Begum's DARDI - pain poetic!!!!



షాజహానా కవితల సంకలనం *దర్దీ* 

**స్వేచ్చగా పల్లెలో పెరిగిన మనసు
రెక్కలు విచ్చుకోని అమాయకత్వం..

పట్నంలో కనబడని తట్టలో 
ఆత్మాభిమానం అమ్ముకోలేను
కమ్ముకున్న ఊరి పొత్తిళ్ళ వాసన వదిలిపోదు..**

 చిన్నప్పుడెప్పుడో.. గడ్డి మొక్కను పెరికి దాని వేరుకంటిన తడిమట్టి సుగంధాన్ని గుండె నిండుగా నింపుకున్న క్షణాలు గుర్తొచ్చాయి షాజహానా కవితల సంకలనం దర్దీ చదువుతుంటే..

*నెలవంకల్ని కుప్పేసి
'అలిఫ్ బే తే'ల్ని సృష్టించినట్లు*

*మనుషులు కావాలి, ఒట్టి మనుషులు
కోపం వస్తే కొట్టుకుని మళ్ళీ కలిసిపోయే 
వీధి కుక్కపిల్లల్లాంటి మనుషులే కావాలి...!
దు:ఖమొస్తే అన్నా...భయ్యా... అని పట్టుకునేడ్చుకునే
హిందూ ముస్లిం కుటుంబాలు కావాలి*

చంకీ కీ.. పాతబస్తీ దు:ఖాలకీ ముడిపెట్టిన తీరు అమోఘం..
*అన్ని చంకీలు చీరమీదకు చేరవు
... ఏ ఎగుమతిలో ఎక్కడిదాకా వెళ్తుందో తెలీయదు
ఏ బురద గుంటలో పడి మునుగు తుందో తెలియదు
కానీ మెరవడం దాని జీవ లక్షణం
పాతబస్తీ నిండా మెరుస్తున్న చంకీలే*

ఇది దర్దీలో మొదటి కవిత.. చదవగానే గుండె గొంతుకలోకి వచ్చింది. ఇక ఇక్కడి నుండీ చదువరుల గుండె బాధ తట్టుకోలేక ఎన్నిసార్లు గతి తప్పుతుందో అంత శాతం మనలో మానవత పాళ్ళూన్నాయనుకోవచ్చు.

నాజూకైన పదాల్లో వేదన సంధించడం ఆమె శైలి.
వేదన కూడా ఇంత ఆర్ద్రతా పూర్వక అగ్ని విరజిమ్ముతుందా .. *నల్లబతుకు* కవిత. 

ఒకటా రెండా.. మొదలు పెడితే కవితలన్నీ ఉదహరించాల్సి వస్తుంది. బూచోడ్ని బూషోడా అని సంబొధించడం.. 

*ఎపుడైనా నా ప్రాంతపు మట్టిని చి రుచి చూశారా
నా ప్రేమికుడిచ్చిన తొలి ముద్దు లా వుంటుంది*

ఓహ్.. అద్భుతం.. ఒక వేదనా భరిత ఇంద్రధనుస్సు షజహానా దర్దీ.. 
తప్పక చదివి ఆ దర్ద్ (అంటే బాధ అని అర్ధం)ని అనుభవించడం అదో హాయి. 
ఇవేళ ఆ * దర్దీ*ని సంపూర్ణం గా పంచుకున్నాను. 





Price: 75/-
Available at all leading book stores

Comments

  1. అద్భుతమైన కవిత్వానికి ఫిట్టింగ్ సమీక్షాభినందనం.

    ReplyDelete
  2. oka manchi rachayitri---buchi reddy

    ReplyDelete

Post a Comment

Popular Posts