కళ్ళకు సీతాకోక చిలుకల పాటలూ!!!!
రోజులెన్నో వస్తుంటాయి వెళ్తుంటాయి...
జీవితాన్ని మలుపు తిప్పే ఘడియల్ని యే రోజు మోసుకొస్తుందో

చెరిపేసి పాతను కొత్తదనపు కౌగిలి అవుతుందో..
ఆ రోజు వరకూ తెలీదు..
కరగని మంచు కూడా అరనిమిషంలో ఆవిరయ్యే
ఆర్ద్రతల్ని అద్దే తోడవుతుందని
కలల వరకూ వెంటొచ్చి
గుండెకు గీతాన్నిచ్చి
గుప్పిట్లో వెలుగై ఇమిడిపోతుంది...
ఇక రొజులై క్షణాలూ
జ్ఞాపకాల జాజులూ
కళ్ళకు సీతాకోక చిలుకల పాటలూ!!!!
-- JayaShree Naidu
Comments
Post a Comment