కవిత్వసృజన by Kavi Yakoob

కవిత్వసృజన ~ 1
......................

సాహితీమిత్రులు ప్రచురించిన 'కవిత- 2011' సంకలనానికి ముందుమాటలో దర్భశయనం శ్రీనివాసాచార్య రాసిన మాటలు చూడండి.

"ఇప్పుడే రాయడం మొదలుపెట్టిన కవికైనా, ఇప్పటికే దశాబ్దాల రచనా ప్రయాణం చేసిన కవికైనా స్వీయ సమీక్ష అవసరమే. ఆవిష్కరించదలుచుకున్న దృశ్యానికీ లేదా ఆలోచనకూ ; ఆవిష్కరించిన శబ్దరూపమిచ్చే అర్థానికీ నడుమ అన్వయం ఉందా అని చూసుకోవడం అత్యవసరమే . దిద్దుబాట్లు ఆవశ్యకమే . తరచి తరచి చూసుకుంటే చేయాల్సిన మార్పులేమిటో తెలుస్తాయి. ఇంకా కొంత సృజనశక్తిని రచనకివ్వాల్సిన అవసరముందా అనే విషయం అర్ధమవుతుంది. "

కవిత్వ సృజన - 2
.......................


~ ఒక కవితలో అనంతాంశాల్ని చెప్పలేం. చెప్పాలని మాత్రం ఏముంది? రాయదలుచుకున్న కవితా వస్తువు పరిధిలో ఎంతో నిర్దిష్టంగా మనసులో గీసుకోవడం అలవాటు చేసుకుంటే సాగతీతలూ, అతిక్రమణలూ, అతివ్యాప్తీ కవితలోకి రాకుండా జాగ్రత్తపడొచ్చు.

ఏ కవితైనా ఎంతసేపట్లో పూర్తిచెయ్యాలి? కాలనిడివి చెప్పలేం, రాసిన మొదటి డ్రాఫ్ట్ బాగుండొచ్చు. సవరణల అవసరం లేకపోవోచ్చు. కాని చాలా కవితల విషయంలో నిర్మాణ సమయం ఎక్కువే ఉంటుంది. తొందరేముంది? రచనావ్యాసంగం దీర్ఘకాల ప్రయాణమని , దానికి దగ్గర దారులు లేవని తెలుసుకుంటే, తొందరపడం !

~ సరియైన ప్రమాణాలతోనే నిర్మాణం చేస్తాం . నిర్మించగానే అంటే,రాయగానే సరిపోదు కదా, అది మనగలగాలి కూడా!!!

[సాహితీమిత్రులు ప్రచురించిన 'కవిత- 2011' సంకలనానికి ముందుమాటలో దర్భశయనం శ్రీనివాసాచార్య రాసిన మాటలు]



కవిత్వ సృజన ~ 3
........................
Ro Hith Comment to Jayashree Naidu 
.......................................................
I do believe in the mystery that the unsaid words leave...but...lessening a poem intentionally is as crime as hammering a long poem. I like the poem...but there is a very complex mystery here that is very opaque. Hope you dry it in your backyard for sometime and let the complexity evaporate.



కవిత్వ సృజన ~ 4
........................



" కవితను పూర్తిచేసినట్లు అనుకోవడానికి ముందు చేసుకోవాల్సిన కసరత్తు ఎక్కువే. 
ఆరంభం, కొనసాగింపు, ముగింపూ -వీటి నడుమ తెగిపోని ధార వుందా అని చూసుకోవడం ప్రాధమిక అవసరం. ఎక్కడైనా తెగితే సరి చేసుకుని ధారను సాధించాలి. చదువుకునేప్పుడు పాఠకుడికి ఈ ధార ఉపకరిస్తుంది. సారాన్ని అందుకోవడానికి చెప్పాల్సిందంతా చెప్పానా అని అనుకోవడంతో సరిపోదు. చెప్పదలచుకున్న అంశాల్ని ఏ క్ర్రమంలో అమర్చి అన్వయాన్ని కాపాడుకుంటున్నామో చూసుకోవడం ముఖ్యాంశమే!! "

[సాహితీమిత్రులు ,విజయవాడ వారు ప్రచురించిన 'కవిత- 2011' సంకలనానికి ముందుమాటలో దర్భశయనం శ్రీనివాసాచార్య రాసిన మాటలు]

Comments

Popular Posts