పుస్తకమా నమోనమహ


రచన ప్రక్రియ.. ఒక  catharsis
బాధల్ని భరించే శక్తినిస్తుంది
సంతోషాన్ని రెట్టింపు చేస్తుంది
ఎంతమంది మహామహుల రచనలున్నాయో.. ఎన్ని మిస్సవ్వకుండా చదివెయ్యాలో..

పుస్తక ప్రపంచాన్ని చూపించే సుజాత బెడదకోట గారు..
ఎప్పుడూ ఆశ్చర్యం వేస్తుంది నాకు.. తనకి ఇంత సమయం ఎలా దొరుకుతుందో అని.. 

సెకండ్ ఇన్ ద లైన్ ఈజ్.. మహేష్ గారు.. 
తను చదివిన ప్రతి పుస్తకాన్నీ తేలిగ్గా ముక్కు సూటిగా నిర్మొఖమాటంగా చెరిగి ఆరేస్తారు.. నచ్చితే మాత్రం సిమ్హాసనం వేసి.. పుస్తకం తో సహా మనం కూర్చోవాలి అనిపించేలా చేస్తారు.



మూడోది... ఫేస్ బుక్ లో పుస్తక ప్రపంచం అన్న గ్రూప్.. 
రోజూ అందులో ఊపిరాడకుండా జరిగే చర్చలు.. అవి పుస్తకాల గురించీ, అందులోని మంచి చెడ్డలూ.. వాదోపవాదాలు.. పుస్తకాలంటే ఇంత ఆపేక్షా అని విస్తుపోతుంటాను అప్పుడప్పుడూ..




Comments

  1. సమయం ప్రత్యేకంగా దొరికించుకోడం ఏమీ ఉండదు జయశ్రీ గారు! దొరికిన సమయంలోనే ఏదో ఒకటి చదవడం..అంతే!
    వంట చేస్తూ కూడా ఒక్కోసారి చదివేస్తుంటాను....వదల్లేని పుస్తకం అయితే...

    థాంక్యూ..గుర్తు చేసుకున్నందుకు

    ReplyDelete

Post a Comment

Popular Posts