అలిఖితాలు 4
ఓయ్ ఇలారా...
ఎంత వ్యధా వేసవో చూశావా
ఒక్క ఆప్త వాక్యం లిఖించి
నిస్తేజపు కాలానికి
ఇంత దాహం తీర్చిపో
ఒక పదం అరువు తెచ్చుకునైనా
గంభీరత చాటు భీరువుకి
హృదయభారం దించిరా
అక్షరమా
నువ్వెంత దయగలదానివి
ఒక్కో క్షణమూ పోగేసుకునే కాలంలా
నీదంటూ యే భావమూ మిగిల్చుకోవు
మావన్నీ నీవే...
కరువు హృదయాల రోజులైనాయి
అకాల మేఘమై కమ్ముకుని
వరదలా వాటేసిపో...
అభావపు ముభావ జీవితాలు నీలో కలిపేసుకో!
పడవల్లా పరుగులెత్తుతూ
ప్రవాహంలో కేరింతలవ్వాలనిపిస్తోంది...
*************** ~~ **************
అంతరాంతరాల ఆగ్రహానికి అక్షరాల అలిఖితాలు
ఎంత వ్యధా వేసవో చూశావా
ఒక్క ఆప్త వాక్యం లిఖించి
నిస్తేజపు కాలానికి
ఇంత దాహం తీర్చిపో
ఒక పదం అరువు తెచ్చుకునైనా
గంభీరత చాటు భీరువుకి
హృదయభారం దించిరా
అక్షరమా
నువ్వెంత దయగలదానివి
ఒక్కో క్షణమూ పోగేసుకునే కాలంలా
నీదంటూ యే భావమూ మిగిల్చుకోవు
మావన్నీ నీవే...
కరువు హృదయాల రోజులైనాయి
అకాల మేఘమై కమ్ముకుని
వరదలా వాటేసిపో...
అభావపు ముభావ జీవితాలు నీలో కలిపేసుకో!
పడవల్లా పరుగులెత్తుతూ
ప్రవాహంలో కేరింతలవ్వాలనిపిస్తోంది...
*************** ~~ **************
అంతరాంతరాల ఆగ్రహానికి అక్షరాల అలిఖితాలు
కొన్ని పదాలు మన ప్రమేయం లేకుండా దూసుకొస్తాయి.
*************** ~~ **************
*************** ~~ **************
Comments
Post a Comment