ముత్యమంత....
నీటి బిందువుదే రూపం...
-
-
-
మేఘాలో వాన చుక్కవా
నేలనింకిన వేరు పెదవి తొడిగిన చిగురువా
చిగురు అంచున విచ్చుకునే రేపటి పువ్వువా..
నీటిబిందువంటి నిన్ను చూశాక
ఎన్నో పిల్లకాలువల పరుగుల పరిచయం
కాలం రహదారి చెరో వైపూ
తొంగిచూసిన కొన్ని మైలు రాళ్ళంటి జ్ఞాపకాలం...
వేళ్ళని వెతుక్కునే మన్ను మనసుకు
చెమ్మై ఇంకే ఆప్యాయతా
కొమ్మలై పరుచుకునే హరిత హృదయం...
ఎన్ని అక్షరాలైతే ఆ సుగంధాల పూలవుతాయి...
గడిచింది ముంజేతి కడియమే
చూసుకొందుకు అద్దమెందుకూ
నగల్లే మెరిసే నేటిలో
ఒక్కో ముద్దునీ ముత్యమల్లె పొదగనా...
-- Jayashree Naidu
Comments
Post a Comment